Share News

High BP: హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సింపుల్‌గా తగ్గించుకోండి..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 05:59 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, మధుమేహంతో పాటు.. హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు పెరగడం, పైగా ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కారణంగా లేనిపోని రోగాలు వస్తున్నాయి.

High BP: హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సింపుల్‌గా తగ్గించుకోండి..!
High Blood Pressure

High Blood Pressure: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, మధుమేహంతో పాటు.. హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు పెరగడం, పైగా ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కారణంగా లేనిపోని రోగాలు వస్తున్నాయి. సాధారణంగా బీపీ అనేది ప్రతి ఒక్కరిలో 120/80 ఉండాలి. కానీ, అంతకు మించి ఉంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి.. ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే.. హైబీపీని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..

బీపీ తగ్గడానికి ఇవి తప్పనిసరి..

👉 రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

👉 మంచి, హెల్తీ ఫుడ్ తినాలి.

👉 ఆహారంలో ఉప్పు, కారం పరిమితంగా తీసుకోవాలి.

👉 అలాగే, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

👉 మద్యం, దూమపానం మానేయడం ఉత్తమం.

👉 రాత్రి సమయంలో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

👉 ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.

👉 అంతకంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేయించుకోవాలి.

👉 జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్‌ను పూర్తిగా అవాయిడ్ చేయాలి.

👉 పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

👉 వీటిని రోజూ పాటించడం ద్వారా బీపీ త్వరగా నియంత్రణలోకి వస్తుంది.

Updated Date - Jan 09 , 2024 | 05:59 PM