Share News

vitamin E Foods : జుట్టు పెరుగుదలకు అడ్డేలేదు, ఈ 7 విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలట...!

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:19 PM

నిమ్మకాయలు, నారింజ, కమలాలు, ద్రాక్షపండ్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌తో నిండి ఉంటాయి.

vitamin E  Foods : జుట్టు పెరుగుదలకు అడ్డేలేదు, ఈ 7 విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలట...!
hair growth

అందమైన వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా ( Hair Growth) ఉంటే ఆ అందమే వేరు. పొడవాటి జడ ఆడవారికి మరింత సోయగాన్ని తెస్తుంది. అయితే సరైన జీవశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా దీనికి ప్రధానంగా అవసరం. జుట్టు పెరుగుదలకు ఆహారమే సరైన పోషణ. మనలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు చీలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ సమస్య కోవిడ్ తర్వాత జుట్టురాలడం అనేది పెద్ద సమస్యగానే మారింది. ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. జుట్టు రాలడం తగ్గాలంటే దృఢమైన జుట్టును పొందాలన్నా కూడా పోషకాహారం తప్పక తీసుకోవాలి. దీనికోసం..

జుట్టు పెరుగుదల కోసం ఆహారం..

జుట్టు పెరగుదల కోసం గుడ్లు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, విత్తనాలు, గింజలు, క్యారెట్లు, ధాన్యం, సోయాబీన్స్, అవకాడో, దాల్చిన చెక్క వంటి ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి.

గుడ్లు..

గుడ్డులో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. జింక్, విటమిన్ ఎ, విటమిన్ డి, లుటిన్ జుట్టుకు పెరుగుదలను ఇస్తాయి. రోజుకి ఒక గుడ్డు ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టుకు ముఖ్యమైన బయోటిన్ అందుతుంది. జుట్టు పెరుగుదల బావుంటుంది. గుడ్డులో ఇనుము కూడా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది.

Health Benefits : గుమ్మడికాయ గింజలు తింటే 6 విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

లీఫీ వెజిటబుల్స్..

ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ శరీరంలో కెరాటిన్ ని అందిస్తాయి. దీనితో జుట్టు పెరుగుదల బావుంటుంది. కుదుళ్లు బలంగా తయారవుతాయి. మనం తినే ఆహారంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫోలికల్స్‌కు తగినంత పోషకాలు లభించవు. ఇది జుట్టు పెరుగుదలకు అడ్డుకుంటుంది. అందువల్ల ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలను తీసుకుంటూ ఉండాలి.

విటమిన్ సి పండ్లు..

నిమ్మకాయలు, నారింజ, కమలాలు, ద్రాక్షపండ్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌తో నిండి ఉంటాయి. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ నష్టం నుండి జుట్టు కుదుళ్లను పెంచుతాయి. స్కాల్ఫ్ బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి కారణంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

విత్తనాలు, గింజలు..

బాదం, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటి మొత్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో హైడ్రేట్ గా ఉంచడంలో సహాపడతాయి. ఒత్తుగా పెరుగుతుంది. శరీరంలో కణాల పునరుత్పత్తిని పెంచడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని పెంచవచ్చు.


క్యారెట్..

క్యారెట్లో విటమిన్ ఎ ఉంటుంది. జుట్టు పెరుగుదలలో విటమిన్ ఎ అవసరం. జుట్టు పెరుగుదలలో కణాల పెరుగుదలకు విటమిన్ ఎ అవసరం.

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..

సోయా బీన్స్..

సోయా బీన్స్ విటమిన్ బి12, మెగ్నీషియం, ఇనుము కలిగి ఉంటుంది. సోయాబీన్స్ డైహెడ్రోటెస్టోస్టెరాన్ నిరోధిస్తుంది. ఇది జుట్టుకు హాని కలిగిస్తుంది. సోయా బీన్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీస్, విటమిన్లు కలిగి ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 27 , 2024 | 01:02 PM