Share News

Amazing Benefits : ఈ నూనెలు జుట్టుకు పోషణతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:34 AM

జుట్టుకు మంచి పోషణ అవసరం. జుట్టు సంరక్షణ విషయంలో సహజమైన నూనెలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Amazing Benefits : ఈ నూనెలు జుట్టుకు పోషణతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి..!
Amazing Benefits

లావెండర్ ఆయిల్ మంచి సువాసనగా అరోమా ఇస్తుంది. అంతేనా మనసుకు ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. మెరిసే జుట్టుకు కూడా మంచి పోషణను అందిస్తుంది. ఇక ఆర్గాన్ ఆయిల్ విషయానికి వస్తే..ఆరోగ్యకరమైన మెరిసే జుట్టుకు మంచి పోషణ అవసరం. జుట్టు సంరక్షణ విషయంలో సహజమైన నూనెలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ నూనెలను ఎలా వాడాలి. వీటితో కలిగే లాభాలను చూద్దాం.

లావెండర్ ఆయిల్ ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలకు మంచి పోషణను అందిస్తుంది. తలకు రక్తప్రసరణకు సహకరిస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు బ్యాక్టీరియా, శిలీంద్రాలు పెరగకుండా నిరోధిస్తుంది. తలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రును తగ్గిస్తుంది.

జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

చుండ్రును తగ్గిస్తుంది

తలకు ఉపశమనంగా పనిచేస్తుంది

పిప్పర్ మింట్ ఆయిల్..

పెప్పర్ మింట్ ఆయిల్ స్కాల్ప్‌ను ఉత్తేజపరిచేందుకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి అద్బుతమైనది. స్కాల్ప్‌కి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దురద, పొడి బారడం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చల్లదనాన్ని అందిస్తుంది.

Drinking Hot Water : వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..


రోజ్మేరీ ఆయిల్..

రోజ్మేరీ ఆయిల్ జుట్టును పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. జుట్టుకు రక్త సరఫరా లేకపోవడం, జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది.

జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

చుండ్రును తగ్గిస్తుంది.

టీట్రీ ఆయిల్..

టీట్రీ ఆయిల్ శక్తివంతమైన ఆయిల్.. యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. నెత్తి మీద ఉపయోగించినప్పుడు ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

శిరోజాలను శుభ్రం చేస్తుంది.

చుండ్రును నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది.

Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!

అర్గాన్ ఆయిల్..

తరచుగా లిక్విడ్ గోల్డ్ అని పిలువబడే ఆర్గాన్ ఆయిల్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టును హైడ్రేట్ గా ఉంటుంది.

జుట్టు తేమగా, మృదువుగా ఉంటుంది.

కనీసం 30 నిమిషాలు లేదా రాత్రి పూట నూనెని తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా వారంలో ఒకరోజు ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 11 , 2024 | 10:34 AM