Share News

Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:44 PM

శరీర ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండాలి. అంతకు మించితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. మన శరీరంలో ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత కాలేయంలో కొవ్వు కణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శరీర బరువు అదుపులో ఉన్నా, మధుమేహం ఉంటే కొవ్వు కాలేయంలో పేరుకుంటుంది.

Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
Liver Health

కాలేయం పక్కటెముక దిగువన ఉంటుంది. ఎడమవైపు కంటే కడుపు కుడి వైపున ఎక్కువ స్థలాన్నితీసుకోవడానికి కొద్దిగా వంగి ఉంటుంది. శరీరంలో ఏ వ్యాధి మొదలైనా కూడా ఆ ప్రభావం మొదటగా చర్మంపై కనిపిస్తుంది. కొన్ని వ్యాధులు చర్మం ద్వారా సంకేతాలను చూపిస్తే, మరి కొన్ని కాలేయానికి అనారోగ్యం వస్తే అది ఎలా తెలుస్తుందంటే..

శరీరంలో ఏ వ్యాధి ప్రారంభం అయినా కూడా చర్మం ద్వారా తెలుస్తుంది. అలాగే కాలేయానికి వ్యాధి సోకినట్లయితే చర్మంలో దురద ఉంటుంది. ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది. స్పైడర్ ఆంజియోమాస్ చర్మంపై రక్తనాళాలు విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తాయి. స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయి శరీరంలో పెరిగినపుడు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే కాలేయం సరిగా పనిచేయడంలేదని అర్థం చేసుకోవాలి.చర్మంపై నీలంగా దద్దుర్లు కూడా ఉంటాయి. చర్మం నీలం రంగులోకి మారినట్లయితే ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాలేయంలో సరైన మొత్తంలో తయారు కానప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా వైద్యుని సహాయం తీసుకోవాలి.

కాలేయం ఆరోగ్యం దెబ్బతిన కుండా చూసుకోవాలంటే..

శరీర ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండాలి. అంతకు మించితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. మన శరీరంలో ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత కాలేయంలో కొవ్వు కణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శరీర బరువు అదుపులో ఉన్నా, మధుమేహం ఉంటే కొవ్వు కాలేయంలో పేరుకుంటుంది. దీనికి కారణం ఒబేసిటీ, మధుమేహం రెండూ సమస్యలూ కాలేయంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయి. దీనిని గమనించుకుని బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి.


Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !

ఫ్యాటీ లివర్..

ఫ్యాటీ లివర్ లేదా లివర్ సిర్రోసిస్ కాలేయం పాడవకుండా ఉండాలంటే ఫ్యాటీ లివర్ పరిస్థితిని తీవ్రంగా తీసుకోవాలి. దీనికి అడ్డుకట్టవేయాలి. అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా లివర్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకుని ఎప్పటికప్పుడు లివర్ సమస్యలు, ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉండాలి.

ఇలా నియంత్రణ..

మధుమేహం వంశపారంపర్యం సమస్యగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబ్టటి మెరుగైన ఆహారంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ ఉండాలి. కూరలు రుచిగా ఉన్నప్పుడు మరికాస్త అన్నం తినేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల బియ్యాన్ని ఇడ్లీలు, దోశలు, పోహా ఈ రూపంలో ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదమే. ఇలా శరీరంలోకి చేరే చక్కెర వేగంగా కరిగి కొవ్వుగా మారుతుంది. ఇది కాలేయానికి చేటును తెస్తుంది.

Eye Health : కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?

శరీరం తేలిగ్గా ఉంటే..

శరీరం తేలిగ్గా ఉంటే ఆరోగ్యం కూడా అంతే బావుంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే శరీరంలో చాలా భాగాలు ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎత్తుకు తగిన బరువుతో ఉంటేనే ఆరోగ్యం బావుంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 08 , 2024 | 12:46 PM