Eye Health : కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?
ABN , Publish Date - Jun 05 , 2024 | 02:10 PM
.బెల్ పెప్పర్ ఇందులోని విటమిన్ సి కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బోక్ చోయ్, కాలీఫ్లవర్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీలతో సాహా అనేక కూరగాయలు, పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కంటికి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ తీసుకునే ఆరహారంలో బలాన్నిచ్చే పదార్థాలను ఎంచుకోవాలి. అందులో ముఖ్యంగా...బెల్ పెప్పర్ ఇందులోని విటమిన్ సి కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బోక్ చోయ్, కాలీఫ్లవర్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీలతో సాహా అనేక కూరగాయలు, పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
పొద్దు తిరుగుడు విత్తనాలు, గింజలు..
గింజలు, బాదం పప్పులలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హాజెల్ నట్స్, వేరుశెనగలు, వేరుశనగ వెన్న కూడా విటమిన్ ఇ కలిగి ఉంది.
గ్రీన్ కూరలు..
ఆకుపచ్చ కూరలైన బచ్చలి, కాలే, కొల్లార్డ్ ఆకు కూరలు, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. వాటిలో కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ కూడా ఉన్నాయి. విటమిన్ ఎ ఇది కంటి శుక్లం రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Health Benefits : వేసవిలో వచ్చే తాటి ముంజులతో ఎన్ని ఉపయోగాలంటే.. !
సాల్మన్..
రెటినాస్ పనిచేయడానికి రెండు రకాల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం. DHA, EPA సాల్మన్, ట్యూనా, వంటి కొవ్వు చేపలలో ఒమేగా 3 ఉంటుంది. ఇది కళ్ల AMD గ్లాకోమా నుండి కాపాడతాయి. ఈ కొవ్వు ఆమ్లాల తక్కువ స్థాయిలు పొడి కళ్లతో ఉంటాయి.
స్వీట్ పొటాటోస్..
కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, చిలగడదుంపలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, మామిడి పండు, అప్రికాట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి తరచుగా తీసుకోవడం వల్ల కంటి చూపు సామర్థ్యం పెరుగుతుంది.
Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..
లీన్ మీట్, పౌల్ట్రీ ఆహారాలు...
జింక్ కాలేయం నుంచి రెటీనాకు విటమిన్ ఎను తీసుకువస్తుంది. ఇది మెలనిన్‌ను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి కంటి ఆరోగ్యానికి పనిచేస్తాయి.
బీన్స్, చిక్కుళ్ళు..
రాత్రిపూట దుష్టిని పెంచే విధంగా శాఖాహారంలో తక్కువ కొవ్వు, అధిక ఫైబర్, జింక్ అధికంగా ఉండే ఆహారాలు.. ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.