Share News

Weight Loss Tips: ఈ 6 టిప్స్‌తో ఈజీగా బరువు తగ్గొచ్చు..

ABN , Publish Date - May 18 , 2024 | 12:17 PM

వ్యాయామం అనేది కేలరీల వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవడం, కేలరీలను బర్న్ చేయడం సాధ్యమేనా.. బరువు తగ్గడం అనేది మొత్తం కేలరీల వినియోగం, కేలరీ ఖర్చుకంటే తక్కువగా ఉన్నప్పుడు జురుగుతుంది. దీనినే కేలరీల లోటు సృష్టించడం అని పిలుస్తారు. వ్యాయామం కేలరీలను బర్నింగ్ చేయడానికి, కేలరీల వ్యయాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

Weight Loss Tips: ఈ 6 టిప్స్‌తో ఈజీగా బరువు తగ్గొచ్చు..
weight management

ఇప్పటి రోజుల్లో బరువు తగ్గడం అంటే పెద్ద సవాలుగా మారింది. ప్రతి ఒక్కరూ అధిక బరువు, ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని వ్యాయామాలు చేసినా, తగ్గకపోవడం దీనికి కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచనలో పడతారు. బరువు తగ్గడానికి, అంకితభావం, జీవనశైలి చిట్కాలు, ఆహార పదార్థాల ఎంపిక, వ్యాయామం అవసరం. అయితే ఎటువంటి వ్యాయామం లేకుండా శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు. అదెలా అంటే..

బరువు తగ్గించే విధానంలో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం. సరైన సమతుల్య ఆహార పదార్థాలను, సరైన వ్యాయామం, జీవనశైలి మార్పులు, జీవక్రియను పెంచడానికి, కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.వేసవిలో చెమట పట్టడం అనేది సహజమే. అయితే వ్యాయామం లేకుండా బరువు తగ్గగలమా..

వ్యాయామం అనేది కేలరీల వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవడం, కేలరీలను బర్న్ చేయడం సాధ్యమేనా.. బరువు తగ్గడం అనేది మొత్తం కేలరీల వినియోగం, కేలరీ ఖర్చుకంటే తక్కువగా ఉన్నప్పుడు జురుగుతుంది. దీనినే కేలరీల లోటు సృష్టించడం అని పిలుస్తారు. వ్యాయామం కేలరీలను బర్నింగ్ చేయడానికి, కేలరీల వ్యయాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

అయితే ఇది బరువు తగ్గడంలో

కేలరీల నియంత్రణ..

కేలరీలను తీసుకోవడంలో శద్ధ అవసరం. శరీరం ప్రస్తుత బరువును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న బరువుకంటే తక్కువ కేలరీలను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.

సమతుల్య ఆహారం..

లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సంపూర్ణ ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు వీలుంటుంది. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.


Immunity Booster : రోగనిరోధక శక్తినిపెంచే హెర్బల్ టీలు ఇవే..

నియంత్రణ..

ఆహారాన్ని తీసుకునేప్పుడు చిన్న చిన్న గిన్నెలను కొలతగా పెట్టుకుని ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇది ఎక్కువ కేలరీలు లోపలికి పోకుండా చేస్తుంది. కేలరీలు తీసుకోవాడాన్ని నియంత్రించడంలో సహకరిస్తుంది.

మీల్..

జంక్, ఆయుల్ ఫుడ్స్ లేదంటే ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు శుభ్రంగా పెరుగుతారు. ఆహారాలు తీసుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇంట్లో వండిన ఆహారాలనే తీసుకువెళ్ళడం నయం.


జీవనశైలి మార్పులు..

బరువు తగ్గడానికి చిన్న చిన్న మార్పులు తప్పని సరి. నిద్ర పోవడం, ఒత్తిడి తగ్గించుకోవాడానికి ప్రయత్నించడం ఇవన్నీ బరువు తగ్గడానికి కారణమవుతాయి. స్థిరత్వం, ఏదైనా సాధించాలనే అంకిత భావం, లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. వ్యాయామం లేకుండానే తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులతో ఏదైనా సాధించవచ్చు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 18 , 2024 | 01:54 PM