మంచి గురువు ధర్మం
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:46 AM
పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేక మంది విద్యాభ్యాసం కోసం వచ్చేవారు.అలా చేరిన శిష్యుల బృందంలో ఒకరోజు ఒక విద్యార్థి వస్తువు కనిపించకుండా పోయింది ఆ వస్తువును ఎవరు తీసుకుని ఉంటారు అనేది అక్కడున్న వారందరికీ తెలుసు.
పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేక మంది విద్యాభ్యాసం కోసం వచ్చేవారు.అలా చేరిన శిష్యుల బృందంలో ఒకరోజు ఒక విద్యార్థి వస్తువు కనిపించకుండా పోయింది ఆ వస్తువును ఎవరు తీసుకుని ఉంటారు అనేది అక్కడున్న వారందరికీ తెలుసు. వారందరూ వెళ్లి, వ మహర్షికి ఆ విద్యార్థి పేరును ఫిర్యాదుచేసారు. అంతా తెలుసుకున్న తర్వాత కూడా మహాముని ఆ విద్యార్థిని దండించకుండా వదిలేసాడు. ఇలా అతన్ని దండించకుండా వదిలేస్తే, ఆశ్రమంలో మేమంతా ఉండటం కష్టం అని వారందరూ మహర్షితో చెప్పారు. దానికి ఆయన ‘చూడండి. మీకు మంచీ చెడు తెలిసిపోయాయి, ఆ విద్యార్థికి ఇంకా తెలియనందువలనే ఇలాంటి తప్పుచేసాడు మీరంతా బయటకు వెళ్లి బ్రతకగలరు కానీ అతనికి మరికొంత కాలం విద్య అవసరం కాబట్టి నేను నా సహాయం అవసరమైన శిష్యుడిని వదులుకోలేను. సంపూర్ణ ఆరోగ్యవంతుని కంటే అనారోగ్యంతోఉన్న వారికేకదా వైద్యుని అవసరం ఎక్కువ’. అని శిష్యులను సమాధాన పరచి పంపివేశాడు. పై కథను పదేపదే ప్రస్తావించడమే కాకుండా అందులోని గురువు ధర్మాన్ని అక్షరాలా అలాగే నిలుపుకున్న మహానుభావుడు మరెవరో కాదు. భారత దేశం నుండి 27 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయుడు, స్వతంత్ర భారత ప్రథమ ఉప రాష్ట్రపతి శ్రీ. సర్వేపల్లి రాధా కృష్ణన్ గారు.