Share News

అరుదైన పురాతన మెట్లబావి

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:05 AM

మహారాష్ట్రలోని పర్బని జిల్లా సేలు తాలూకాలో సుమారు వెయ్యి లేదా పదిహేను వందల యేళ్ల నాటిదిగా భావిస్తున్న అత్యంత పురాతన

అరుదైన పురాతన మెట్లబావి

మహారాష్ట్రలోని పర్బని జిల్లా సేలు తాలూకాలో సుమారు వెయ్యి లేదా పదిహేను వందల యేళ్ల నాటిదిగా భావిస్తున్న అత్యంత పురాతన వర్తులాకార మెట్లబావి అక్కడి స్థానిక ప్రజల చొరవతో ఈ మధ్య శుభ్రపడి, మరలా అందంగా రూపు దిద్దుకుంది. ఈ బావికి ఎనిమిది వైపులా ఎనిమిది సర్పిలాకార మెట్ల వరుసలు ఉన్నాయి. భారతీయ వాస్తు నిపుణుల పనితనానికి, మన సంప్రదాయ నిర్మాణాలకు ఈ బావి ఒక మచ్చు తునక అని చెప్పుకోవచ్చు.యేళ్ల తరబడి చెత్తా చెదారం పేరుకుని పోయి ఉన్న ఈ బావిని కొన్ని రోజుల క్రితం వాలూరు స్థానిక ప్రజలు స్వఛ్ఛందంగా ముందుకు వచ్చి, ఆ చెత్తను అంతా తొలగించి, బావికి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చారు.

Updated Date - Jul 23 , 2024 | 06:05 AM