Share News

మీకు తెలుసా?

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:53 AM

చిన్న ఎలుకలా ఉండే ఈ జీవిని యూరోపియన్‌ హెర్జ్‌హాగ్‌, కామన్‌ హెర్జ్‌హాగ్‌ అని పిలుస్తారు.

మీకు తెలుసా?

చిన్న ఎలుకలా ఉండే ఈ జీవిని యూరోపియన్‌ హెర్జ్‌హాగ్‌, కామన్‌ హెర్జ్‌హాగ్‌ అని పిలుస్తారు.

15 సెం.మీ నుంచి 30 సెం.మీ పొడవు మాత్రమే ఉంటుంది. రెండు కేజీల వరకూ బరువు ఉంటుంది.

నల్లటి ముక్కు, గోధుమరంగు ముఖం ఉండే ఈ జంతువు మీద వేలకొద్ది స్పైన్స్‌ ఉంటాయి. 160 మిలీమీటర్లు మాత్రమే ఈ పదునైన స్పైన్స్‌ ఉంటాయి. ఇవి పెద్దయ్యాక 260 మి.మీటర్లు పెరుగుతాయి. ప్రతి ఒక్కటి రాలిపోయి మళ్లీ వస్తాయి. ఇదో బంతిలా చుట్టుకుంటుంది. గంటకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది.

ఈ జీవులు అధికంగా యూరప్‌ దేశాలయిన ఆస్ర్టియా, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, ఫిన్లాండ్‌, జర్మనీ దేశాల్లో కనిపిస్తాయి.

ఇవి చిన్న గూళ్లలాంటివి చెట్లమీద, తొర్రల్లో కట్టుకుంటాయి. రాత్రితో పాటు పగలు కూడా చెట్ల ఆకుల్లో నిద్రపోతాయి.

వీటి చూపు తక్కువ. దీంతో ఆహారాన్ని వాసనపట్టి మాత్రమే వెంటాడతాయి. చిన్న పురుగులు, మిడతలను తింటాయివి.

ఇవి పుట్టిన 32 రోజుల వరకూ చూడలేవు. కళ్లు కనపడవని చెప్పవచ్చు. స్పైన్స్‌కూడా మెత్తగా ఉంటాయి.

వీటిలో 15 రకాల జాతులున్నాయి.

హెర్జ్‌హాగ్‌ల జీవనకాలం కేవలం రెండేళ్లు.

Updated Date - Jul 24 , 2024 | 05:53 AM