Share News

Littles : మీకు తెలుసా?

ABN , Publish Date - Sep 01 , 2024 | 01:09 AM

రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్‌ ఫిష్‌’ అని పిలుస్తారు.

Littles : మీకు తెలుసా?

  • రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్‌ ఫిష్‌’ అని పిలుస్తారు.

  • ప్రపంచంలో ఉండే విషప్రాణుల్లో ఇవి ప్రమాదకరం. పాముకాటులానే ఉంటుంది. నొప్పి, రక్తస్రావంతో పాటు నాడుల మీద పనిచేసి కిందపడిపోవటం, గుండెపోటు లాంటివి సంభవిస్తాయి.

  • 40 సెం.మీ ఉండే ఈ చేప ఎరుపు, పసుపు, నలుపు ఇలా వివిధ రంగుల్లో కనిపిస్తుంది. వాతావరణానికి తగినట్లు రంగుమారుతుంది. రాళ్లమధ్యలో ఉంటే రాయిలానే ఉంటుంది.

  • ఈ విషంతో ఇతర చిన్న జీవులను చంపి ఆరగిస్తుంది. ఇవి నెమ్మదిగా ఈదుతాయి. అయితే దాడి చేయాలనుకుంటే మాత్రం 0.015 సెకన్స్‌లోనే అవతలి జీవిని కొరికేస్తుంది.

  • నీళ్ల బయట పడితే రోజుపాటు జీవించగలవు. వీటి శరీరంపై ఉండే ప్రత్యేక కణ నిర్మాణం వల్లే ఇలా జీవించగలుగుతాయి.

  • ఇవి ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. బరువు సుమారు రెండు కేజీలుంటాయి.

  • వీటిని సముద్రంలోని పాములు వేటాడి తింటాయి. వీటి జీవనకాలం 5 సంవత్సరాలనుంచి 10 ఏళ్లు వరకూ!

  • ఏదైనా జీవి తన దగ్గరకు వస్తోందంటే తెలివిగా నటిస్తాయి. రాళ్లలో కలిసిపోయి కదలకుండా ఉంటాయి. చనిపోయిందేమోనన్న అనుమానం కలిగేలా ఉంటుంది. అయితే దాన్ని ఏ జీవి అయినా కెలికితే మాత్రం దాడి చేస్తుంది.

Updated Date - Sep 01 , 2024 | 01:09 AM