Share News

Littles : రాజుగారి కల

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:06 AM

విజయ నగరాన్ని పాలించే కృష్ణ దేవరాయలకు ఒక రాతిర వింతైన కల వచ్చింది. ఆ కలలో ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నాడు.

Littles : రాజుగారి కల

విజయ నగరాన్ని పాలించే కృష్ణ దేవరాయలకు ఒక రాతిర వింతైన కల వచ్చింది. ఆ కలలో ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ ఆసనం మనసులో ఏ ప్రదేశాన్ని తలచుకుంటే అక్కడికి క్షణంలో తీసుకుపోతుంది. ఆ సింహాసనం మీద పొదిగి ఉన్న విలువైన రత్నాలు వజ్రాల్లో మొత్తం రాజుగారి రూపమే కనబడుతోంది. తర్వాత రాజు కొలువులో కూనర్చుని,, తన కలలో కనిపించిన ఆసనం వంటిదే కావాలని ఆజ్ఞ ఇచ్చాడు.

రాజోద్యోగులందరూ గాలిలో ఎగిరే ఆసనం, క్షణంలో కోరుకున్న చోటికి చేర్చే ఆసనం ఎలా సాధ్యం అని గుసగుసలు పోయారు. రోజులు గడుస్తున్నా, రాజుగారు తన కల గురించి అందులో తను చూసిన సింహాసనం గురించి చెప్పడం మానలేదు. ఒకరోజు ఒక పేదవృధ్దుడు రాజుగారి కొలువుకు వచ్చి, ‘నేను దాచుకున్న వంద బంగారు కాసులు ఎవరో దొంగిలించారు, ఆ దొంగను పట్టుకుని శిక్ష వేసి, నా బంగారం నాకు ఇప్పించండి’ అని మొర పెట్టుకున్నాడు. ‘ఇంతకీ నీ సొమ్ము కాజేసింది ఎవరు;?’ అని రాజు అడిగాడు ‘నిన్న రాత్రి నా కలలో కనిపించి, నా సొమ్ముకాజేసింది మీరే మహారాజా’ అని అతను జవాబు చెప్పాడు.


అక్కడున్న వారంతా ఆ ముసలి వాడికి మరణ దండన ఖాయం రాజుగారినే దొంగ అంటాడా. అనుకున్నారు. రాజు కూడా ముసలి వాడితో ‘నేను నీ సొమ్ము ఎందుకు కాజేస్తాను? అలా ఎలా మాట్లాడుతావు? కలలో కనబడితే మాత్రం అది నిజం అవుతుందా?’ అని గట్టిగా అడిగాడు వెంటనే ఆ వృధుడు తాను అతికించుకున్న గడ్డం, మాసిన దుస్తులు తొలగించి, మెరిసే బట్టలు ఆ భరణాలతో ముందుకు వచ్చి నిలబడి, ‘కలలో జరిగిన దొంగతనం ఎలా నిజం కాదో, కలలో కనిపించిన ఎగిరే సింహాసనం కూడా నిజం కాదు కాబట్టి, ఇక దాని విషయమై అన్వేషణ కూడా ఆపు చేయించండి మహారాజా’ అని చిరునవ్వు నవ్వాడు మారు వేషం తొలగించిన తెనాలి రామలింగ కవి. తనకు కను విప్పు కలగడానికే తెనాలి రాముడు ఇలా నాటకం ఆడాడు అని తెలుసుకున్న రాజుగారు ఎప్పటిలాగే తెనాలి రాముని సన్మానించి, అతని బుఽధ్ది కుశలతను ఎంతో మెచ్చుకున్నాడు.

Updated Date - Jul 12 , 2024 | 01:07 AM