Share News

Littles : ధర్మారాయుడి తీర్పు

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:25 AM

ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది.

Littles : ధర్మారాయుడి తీర్పు

Littles : ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది. ఆ గ్రామంలో ఒక వర్తకుడు రామయ్య అనే రైతుకు తన పొలంలోని బావిని అమ్మాడు.

కానీ రామయ్య ఆ బావిలోని నీళ్లు వాడుకోబోతుండగా వర్తకుడు రామయ్యతో ‘నేనునీకు బావి మాత్రమే అమ్మాను కానీ అందులోని నీళ్లు కాదు. ఆ నీళ్లు ఇంకా నావే. కాబట్టినువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బావిలోని నీళ్లు వాడుకోకూడదు’ అని షరతు పెట్టాడు. ఈ మాటలు విన్న రామయ్యకు ఏం చేయాలో పాలుపోక, ధర్మారాయుడికి ఫిర్యాదు చేశాడు.

గ్రామంలోని మిగతా వారందరికీ వర్తకుడు పెట్టిన షరతు అన్యాయంగా అనిపించినా ఎవరూ ఏమీ చేయలేక ఊరుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మారాయుడు వర్తకుడిని పిలిచి, నువ్వు రామయ్యకు బావిని మాత్రమే అమ్మావు కనుక అతని బావిలో నీ నీళ్లు ఉండటం న్యాయ సమ్మతం కాదు, నీ నీళు ్లఅన్నిటినీ తీసుకెళ్లి మరెక్కడైనా దాచుకో లేదా నీళు బావిలో ఉంచినందుకు, రామయ్యకు అద్దెచెల్లించు అని తీర్పు ఇచ్చాడు. అందరూ వర్తకుడి మోసనపు బుధ్దికి మంచి గుణపాఠం నేర్పాడని ధర్మారాయుడిని పొగిడారు.

Updated Date - Aug 25 , 2024 | 12:25 AM