Share News

Littles : తెలివి తక్కువ తోడేలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:23 AM

ఒక పావురం మరియు కోడిపుంజు అనుకోకుండా అడవిలో కలుసుకుని,మంచి స్నేహితులయ్యాయి.రోజూ అవి కాసేపు కలుసుకుని, కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజు ఆ రెండూ అలాగే కలుసుకుని పావురం చెట్టుమీద వాలి, కోడిపుంజు నేలమీద గింజలు వెతుక్కుంటూ ఉండగా....

Littles : తెలివి తక్కువ తోడేలు

Littles : ఒక పావురం మరియు కోడిపుంజు అనుకోకుండా అడవిలో కలుసుకుని,మంచి స్నేహితులయ్యాయి.రోజూ అవి కాసేపు కలుసుకుని, కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజు ఆ రెండూ అలాగే కలుసుకుని పావురం చెట్టుమీద వాలి, కోడిపుంజు నేలమీద గింజలు వెతుక్కుంటూ ఉండగా, బాగా ఆకలి మీద ఉన్న ఓ తోడేలు అటుగా వచ్చి, మేత కోసం తిరుగుతున్న కోడిపుంజును చూసింది.చూడగానే మనసులో ఇలా అనుకుంది, ‘ఈ కోడిపుంజు చక్కగా కొవ్వు పట్టి ఉన్నది. దీన్ని కానీఇంటికి పట్టుకెళ్లగలిగితే నాకు ఇవాళ విందు భోజనమే’ అనుకుని, అదను చూసి, చాటునుండి కోడిపుంజు మీద దాడి చేసింది.

దాన్ని అలాగే పట్టుకుని తన దగ్గరున్న సంచీలో వేసుకుంది. కోడిపుంజు చాలా భయపడిపోయి, సంచీలోనుంచే గట్టిగా అరవసాగింది. చెటుట్ట పైన కొమ్మమీద కూర్చుని ఇదంతా గమనించిన పావురం తన మిత్రుడికి ఏదైనా సాయం చేయాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా వెళ్లి, తోడేలు వెళ్లే దారిలో చచ్చిపోయినట్టు కదలకుండా పడుకుంది.

అది చూసిన తోడేలు‘ అదృష్టమంటే ఇవాళ నాదే, ఒకేసారి పావురం, కోడిపుంజు ఇవాళ రెండు పూటలా విందు నాకుఅనుకుంటూ పావురాన్ని సంచీలో వేయడానికి సంచీ తెరిచి పక్కన పెట్టింది, ఇదే అదనుగా సంచీలోఉన్న కోడిపుంజుమెల్లగా బయటపడి, తన స్థానంలో ఆ సంచీలో ఒక రాయిని పెట్టింది ఈ లోగా తోడేలు దగ్గరికి రావడం గమనించిన పావురం చటుక్కున లేచి, ఎగిరిపోయింది.

‘అమ్మ పావురమా పిడికెడు ఉన్నావు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా?’అనుకున్నది తోడేలు. అలా సంచీని మోసుకుంటూ ఆనందంగా ఇంటికి వెళి,్ల సంచీ తెరిచి చూసి, అందులో కోడిపుంజు కాక పెద్ద రాయి ఉండటంతో అయోమయంగా కోడిపుంజు రాయిగా ఎలా మారిందా అని ఆలోచిస్తూ, ఆ పూట విందు కాదు కదా అసలు భోజనమే పోగొట్టుకున్నందుకు ఏడ్చింది తోడేలు. ఆ రోజు సాయంత్రం మరలా పావురం కోడిపుంజు రెండూ కలిసి తోడేలు తెలివి తక్కువ తనాన్ని తలచుకుని నవ్వుకున్నాయి. సమయస్ఫూర్తితో ,ఉపాయంతో అపాయాల నుండి తప్పించుకోవచ్చు. మనమేకాక మన మిత్రులను కూడా కాపాడుకోవచ్చు.

Updated Date - Sep 07 , 2024 | 12:23 AM