Share News

Raghav Khanna : దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:29 AM

దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. రాఘవ్‌ ఖన్నా దర్శకత్వంలో ‘ద మోడరన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తోంది.

Raghav Khanna : దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ

దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. రాఘవ్‌ ఖన్నా దర్శకత్వంలో ‘ద మోడరన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తోంది. ఆగస్టు 2న ఇది విడుదల కానుంది. దర్శకుడిగా రాజమౌళి ప్రయాణాన్ని.. ఆయన ఇండియన్‌ సినిమాపై చూపిన ప్రభావాన్ని ఇందులో చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి ఆయన బంధుమిత్రులు, దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌, రుస్సో బ్రదర్స్‌, హీరోలు రానా, ప్రభాస్‌ తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.

Updated Date - Jul 07 , 2024 | 01:29 AM