Technology: ఇక ఉబర్ రైడ్‌లో గేమ్స్ ఆడొచ్చు
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:55 AM
ఆడుతు, పాడుతు పనిచేయడం కాదు, ప్రయాణిస్తే ఎంతో బాగుంటుంది. ఉబర్ సరిగ్గా అదే పని చేయ నుంది. ఉబర్ తన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రైడ్ సమయంలో మినీగేమ్స్ను పరిచయం చేసే పనిలో ఉంది. అందుకుగానే యాప్‌లోనే మినీ గేమ్స్‌ను అభివృద్ధిపరుస్తోంది.
ఆడుతు, పాడుతు పనిచేయడం కాదు, ప్రయాణిస్తే ఎంతో బాగుంటుంది. ఉబర్ సరిగ్గా అదే పని చేయ నుంది. ఉబర్ తన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రైడ్ సమయంలో మినీగేమ్స్ను పరిచయం చేసే పనిలో ఉంది. అందుకుగానే యాప్‌లోనే మినీ గేమ్స్‌ను అభివృద్ధిపరుస్తోంది. నెట్ కనెక్షన్ ఉంటేనే ఈ గేమ్స్‌ని ఫ్రీగా ఆడుకునే సౌలభ్యం ఉంటుంది.
అయితే అధికారికంగా దీనిపై సమాచారం వెలువడలేదు. ఇదే వస్తే ఉబర్ వాహనంలో కూర్చుని ఇకపై దారిలో ఉన్న గోడలు, మిద్దెలు, భవంతులూ చూస్తూ ఉండనవసరం లేదు. ఇటీవలే ఉబర్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ని విడుదల చేసింది. అందులో చాలా గేమ్స్ రిఫరెన్స్‌లు ఉన్నాయి.
ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని ఒక కోడ్ చెబుతోంది. అంతకుమించిన అధికారిక వివరాలు ఏవీ లేవు. ఆ గేమ్స్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి, అవి ఉచితమా, కొనుగోలు చేయాలా అన్న వివరాలు కూడా లేవు. గత నెలలోనే యూట్యూబ్ కొన్ని చిన్నపాటి గేమ్స్‌ను ఐఫోన్ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. దాన్నే ఉబర్ కూడా ఫాలో అవుతున్నట్టుంది. దీంతో అటు ప్రయాణం, ఇటు ఆనందాన్ని జోడించే యత్నంలో ఉబర్ ఉందని మాత్రం అర్థం అవుతోంది.