Share News

Viral: నిజమైన వివేక్ రామస్వామి జోస్యం.. ఆశ్చర్యపోయిన ఎలాన్ మస్క్!

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:14 PM

అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకుంటారంటూ ఏడాది క్రితమే రామస్వామి చెప్పిన జోస్యం నిజమవడంపై ఎలాన్ మస్క్ ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Viral: నిజమైన వివేక్ రామస్వామి జోస్యం.. ఆశ్చర్యపోయిన ఎలాన్ మస్క్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకున్నట్టు జో బైడెన్ ఆదివారం అకస్మాత్తుగా ప్రకటించడం సంచలనంగా మారింది. తాను పోటీలోనే ఉంటానంటూ చివరి వరకూ చెబుతూ వచ్చిన బైడన్ సడెన్‌గా తాను తప్పుకున్నట్టు ప్రకటించారు. అయితే, ఎనిమిది నెలల క్రితమే భారత అమెరికన్ నేత వివేక్ రామస్వామి (NRI) చెప్పిన జోస్యం తాజాగా పరిణామంతో నిజమని తేలడంతో ఏకంగా టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా షాకైపోయారు. వివేక్ చెప్పినవన్నీ జరిగాయంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

NRI: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం


ఈ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన నేతల్లో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన అధ్యక్షుడు బైడెన్‌పై తొలి నుంచి విరుచుకుపడ్డారు. వృద్ధాప్యంతో నిత్యం తడబడుతూ, ప్రసంగాల్లో పొరబడుతూ ఉండే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారని అప్పుడే చెప్పారు. బైడెన్‌‌ను సమర్థిస్తున్న వర్గాలకు ఆయన ఉపయోగం ఎప్పుడో తీరిపోయిందని అన్నారు. ట్రంప్ అధికారంలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవడమే వారి వ్యూహమని అన్నారు. చివరి నిమిషంలో కీలక మార్పులు చేసి ప్రత్యర్థులను కన్‌‌ఫ్యూజ్ చేస్తూ ట్రంప్‌ను అడ్డుకోవాలన్నది వారి వ్యూహమని చెప్పుకొచ్చారు. ఓ టీవీ ఇంటర్వూలో తాను చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు (Elon Musk Reacts After Vivek Ramaswamys Biden Prediction Goes Viral ).


ఈ పోస్టుపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఆయన చెప్పిన వన్నీ నిజమయ్యాయంటూ ఆశ్చర్యపోయారు. మరోవైపు, నెటిజన్లు కూడా రామస్వామిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఈయన కచ్చితంగా ప్రశంసలకు అర్హుడే. ఏడాదిగా వివేక్ ఇదే చెబుతున్నారు. చివరి నిమిషంలో మార్పులతో మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తారని హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఆయన్ను కొట్టిపారేశారు. ఆయనవి అభూతకల్పనలు అన్నారు. నవ్వుకున్నారు. ఇప్పుడు వారి నవ్వులన్నీ మాయమయ్యాయి’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వివేక్ పేరు ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్‌లో ఉంది.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 05:24 PM