Share News

Dubai: శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం.. పాల్గొన్న దంపతులు

ABN , Publish Date - May 22 , 2024 | 07:07 PM

దుబాయిలో శ్రీసత్యనారాయణ స్వామి వత్రం భక్తి శ్రద్దలతో జరిగింది. స్థానిక గల్ఫ్ రెడ్డి సంఘం (జి.ఆర్.ఎ) ఆధ్వర్యంలో ఈ సత్యదేవుని వ్రతానికి తెలుగు దంపతులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దుబాయిలోని ప్రముఖ వేద పండితుల్లో ఒకరైన రావులపాలెంకు చెందిన ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి జరిగింది.

Dubai: శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం.. పాల్గొన్న దంపతులు

దుబాయిలో శ్రీసత్యనారాయణ స్వామి వత్రం భక్తి శ్రద్దలతో జరిగింది. స్థానిక గల్ఫ్ రెడ్డి సంఘం (జి.ఆర్.ఎ) ఆధ్వర్యంలో ఈ సత్యదేవుని వ్రతానికి తెలుగు దంపతులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దుబాయిలోని ప్రముఖ వేద పండితుల్లో ఒకరైన రావులపాలెంకు చెందిన ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి జరిగింది.

sn0.jpg


ఈ సత్యదేవుని వ్రతం ఎందుకు చేయ్యాలి, ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలతోపాటు సత్యనారాయణ స్వామి కథను సైతం ఆయన తెలుగు జంటలకు ఈ సందర్బంగా విశదీకరించారు. అన్నవరంలో కొలువుదీరిన సత్యదేవుని సన్నిధిని గురించి కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు.

sn2.jpg


ఈ వత్రం సందర్భంగా వేద మంత్రాలను చదువుతూ పుష్పాలతోపాటు పసుపు కుంకుమతో స్వామివారిని పూజించే విధానాన్ని భక్తులకు వేద పండితుడు ప్రవీణ్ విడమర్చి తెలియ జేశారు. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గోన్న జంటలకు.. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుడు జె.పి.రెడ్డి ప్రత్యేకంగా తీసుకోవచ్చిన అమ్మవారి శేష వస్త్రంతోపాటు జాకెట్ ముక్కలను అందజేశారు.

sn3.jpg


ఈ వ్రతం అనంతరం... భారతీయ సంప్రదాయంగా భక్తులందరికి ఆరటి ఆకులలో భోజనం వడ్డీంచారు. భారతదేశం నుండి ఈ ఆరటి ఆకులను ప్రత్యేకంగా ఈ వ్రతం కోసం తెప్పించారు. ఈ వ్రతం సందర్భంగా దేవుని సన్నిధానంలో మోహన మనస్వీని కొనిరెడ్డి మరియు నైషిత చౌదరి గుండపనేనిలు చేసిన ఆరాధాన నృత్య అందర్ని అలరించింది.

sn4.jpg


ఇక ఇతరదేశంలో ఉన్నప్పటికీ పూర్తిగా సంప్రదాయ పద్దతిలో ఈ సత్యదేవుని వ్రతం జరగడం పట్ల ఓమెగా రమేశ్ రెడ్డి, వేంపల్లి ఆనందం వ్యక్తం చేశారు. తమ సొంత ఊరిలో తమ కుటుంబ సభ్యుల మధ్య స్వామి వారి వ్రతాన్ని జరుపుకోన్న అనుభూతి కలిగిందని దగ్గుల సంతోష్ పేర్కొన్నారు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని, ఆచార్య వ్యవహారాలను వ్రతం సందర్భంగా వివరించిన తీరును కవిత, సురేష్ బాబుల దంపతులు అభినందించారు.

sn5.jpg


ఆన్‌లైన్‌లో వ్రతం వీక్షిస్తే అన్నవరంలో గడిపిన అనుభూతి కల్గిందని శ్రీదేవి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. భారత్ వెళ్లిన ప్రతిసారి అన్నవరంలో ఉన్న సత్యదేవున్ని సన్నిధిలో స్వామి వారి వ్రతంలో పాల్గొంటానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక ప్రతీ సంవత్సరం జరుగుతున్న సత్యదేవుని వ్రతంలో పాల్గొంటున్న జంటల సంఖ్య క్రమేపి పెరుగుతందని నిర్వహకులు ఈ సందర్భంగా వెల్లడించారు.

sn6.jpg


కుల, మత, ప్రాంతాలకు తావు లేకుండా భక్తులందరు తాము నిర్వహించె వ్రతంలో పాల్గోంటారని పేర్కొన్నారు. జి.ఆర్.ఏ పక్షాన జి.ఆర్.రెడ్డి, బ్రహ్మానందనరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డిలతో పాటు ప్రసన్న సోమిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

sn7.jpg


sn8.jpg

Updated Date - May 22 , 2024 | 08:45 PM