Share News

NRI: మంత్రి లోకేష్ చొరవతో సౌదీలో మహిళకు బాసట..

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:57 PM

ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు​ సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.

 NRI: మంత్రి లోకేష్ చొరవతో సౌదీలో మహిళకు బాసట..
Minister Nara Lokesh, Woman Evacute To India

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉపాధి కొరకు అరబ్బు ఎడారి దేశానికి వచ్చి ఇబ్బందులను ఎదుర్కోంటున్న చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన శేఖ్ హసీనా అనే 25 ఏళ్ళ యువతి తనను రక్షించాలంటూ మంత్రి నారా లోకేశ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన విన్నపం ఫలించింది.


​ఈ మేరకు సౌదీ అరేబియాలోని ఎపి ఎన్నార్టీ ప్రతినిధి, చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజీత్ మంగళవారం హాసినాను మరో ప్రతినిధి ముజ్జమ్మీల్ శేఖ్ సహాయంతో రియాధ్ నగరంలో హాసీనాను సురక్షితంగా భారతీయ ఎంబసీ అధికారులకు అప్పగించారు. గత కొన్ని రోజుల నుండి సరిగ్గా తిండిలేక నీరసించిపోయిన అమెకు భోజన ఏర్పాట్లు చేయించి కొంత మెర నగదు కూడ అందించారు.


హాసీనాను సురక్షితంగా చేర్చిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణాతో పాటు విజయవాడలోని ఎపి ఎన్నార్టీ అధికారులకు కూడ వారు తెలియజేసారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారుల సహాయంతో అమె వీసాను రద్దు చేసి స్వదేశానికి పంపించడానికి ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తారని రంజీత్ చెప్పారు.

Updated Date - Aug 07 , 2024 | 09:13 AM