Home » Chittoor
అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో మరో కొండను తలపించేలా చెత్త పేరుకుపోయింది. ఇక్కడి పర్యావరణానికి నష్టం కలిగేలా తయారైంది. పచ్చని చెట్ల మధ్య సుమారు లక్ష మెట్రిక్ టన్నుల వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
బంతి పూలకు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు కోయకుండా తోటపైనే వదిలేస్తున్నారు.రెండు వారాలుగా పూలను కోసి మార్కెట్కు తరలిస్తున్నా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా ఆలయానికి రూ.4,44,49,759 ఆదాయం లభించినట్లు ఈవో గురుప్రసాద్ తెలియజేశారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. వర్సిటీ గరుడాచలం హాస్టల్లోని ఓ గదిలో డ్రగ్స్ ఉన్నాయంటూ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు గణేష్ నేతృత్వంలో నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్ను అమలు చేసే దిశగా ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అపార్ (ఆటో మేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నెంబర్ మంజూరుకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో మూడు వారాలుగా విద్యార్థులకు ఇస్తున్న ..
మదనపల్లిలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారు నగలు.. ఇక బ్యాంకు అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు.. ఇదంతా ఓ మాజీ డిప్యూటీ కలెక్టర్ అవినీతి భాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది.
నకిలీ నోట్లు ఎలా ముద్రించాలి?’ అనేది యూట్యూబ్లో చూశారు. ఆ ప్రకారం వస్తువులు తీసుకొచ్చి ముద్రణ చేపట్టారు. వీటిని చెలామణి చేసే క్రమంలో పట్టుబడ్డారు.
ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో పాపం.. డార్మిటరీలోని ఐటర్కాట్కు టవల్ను బిగించి ఉరేసుకుని చనిపోయాడు. అంతవరకు తమతో పాటే వంట పనుల్లో సాయం చేసిన ఆ చిన్నారి.. విగతజీవిగా మారిపోవడంతో సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్యారంపల్లెలో గురుకులంలో 5వ తరగతి చదువుతున్న తిరుపతి జిల్లాకు చెందిన రెడ్డిమోక్షిత్ మృతి కలకలం రేపింది.