Share News

Kanipakam: వరసిద్ధుడి ఆలయానికి రూ.4.44 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:22 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్‌, సీల్డ్‌ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా ఆలయానికి రూ.4,44,49,759 ఆదాయం లభించినట్లు ఈవో గురుప్రసాద్‌ తెలియజేశారు.

Kanipakam: వరసిద్ధుడి ఆలయానికి రూ.4.44 కోట్ల ఆదాయం
వేలం నిర్వహిస్తున్న ఆలయ అధికారులు

ఐరాల(కాణిపాకం), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్‌, సీల్డ్‌ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా ఆలయానికి రూ.4,44,49,759 ఆదాయం లభించినట్లు ఈవో గురుప్రసాద్‌ తెలియజేశారు. వాహన పూజా సామగ్రి విక్రయించే హక్కును రూ.50,50,000, కొబ్బరి చిప్పల పోగు చేసుకునే హక్కును రూ.45,66,000, కోనేరు వద్ద నేతి దీపాలను విక్రయించే హక్కును రూ.67,00,99, వినాయక సదన్‌ వద్ద హోటల్‌ నిర్వహించే హక్కును రూ.27,00,000, చెవి, ముక్కు పోగులు కుట్టు హక్కును రూ.6,50,000, మరగదాంబిక కల్యాణ మండపం వద్ద బంకు నిర్వహణ హక్కును రూ.63,000, మణికంఠేశ్వరాలయం వద్ద బంకు నిర్వహణ హక్కును రూ.6,30,900లకు హెచ్చు పాటదారులు దక్కించుకున్నారు. షాపింగ్‌ కాంప్లెక్సు వద్ద 24 షాపులకు ఆన్‌లైన్‌ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా రూ.2,40,88,860 ఆదాయం సమకూరింది. ఇందులో షాపు నెంబరు 1కి అత్యధికంగా రూ.1,09,08,000తో రాజారామ్‌ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ బాలరంగస్వామి, కోదండపాణి, క్లర్క్‌ హేమేశ్వర్‌బాబు, కాణిపాకం ఎస్‌ఐ ధరణీదర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:22 AM