Share News

NRI: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:38 PM

అమెరికా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ డాక్టర్ జెట్టి హారిక కన్నుమూశారు. తెనాలికి చెందిన హారిక వెటర్నరీ డాక్టర్. ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు.

NRI: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి డాక్టర్ జెట్టి హారిక కన్నుమూశారు. తెనాలికి చెందిన హారిక వెటర్నరీ డాక్టర్. ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు. కాగా, కూతురి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హారిక మృతదేహం తెనాలి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పందించారు. అమెరికాలో తన మిత్రులతో మాట్లాడిన ఆయన హారిక మృతదేహాన్ని తెనాలికి పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. హారిక కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - Jul 21 , 2024 | 09:40 PM