Share News

Pawan Kalyan Birthday: దుబాయ్‌లో ఘనంగా పవన్ కల్యాణ్ బర్త్‌డే..

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:22 PM

Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..

Pawan Kalyan Birthday: దుబాయ్‌లో ఘనంగా పవన్ కల్యాణ్ బర్త్‌డే..
Pawan Kalyan Birthy

Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అలరించాయి.


కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, పార్టీ గాజువాక ఇన్‌ఛార్జ్ కోన తాతారావు, మాడుగుల ఇన్‌ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అతిధులు.. జనసేన బలోపేతానికి గల్ఫ్ విభాగం ఎంతో కృషి చేసిందన్నారు. గల్ఫ్ జనసేన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందని కొనియాడారు. ‘నా సేనకు-నావంతు’ భాగంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన విజయం సాధించిందని.. ఈ విజయం కైవసం చేసుకోవడానికి ఎన్నో అటుపోటులను తట్టుకుని పార్టీ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులకు జాతీయ, ప్రాంతీయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, జనసేన వీరమహిళలను సన్మానం చేశారు.

Pawan Kalyan Birthday


ఈ జన్మదిన వేడుకలు కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. అదే సమయంలో పెద్దఎత్తున్న వైసీపీ నుండి కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.


కరోనాకు ముందు దుబాయ్ నుండి విశాఖపట్నంకు ఫ్లైట్ ఉండేదని.. అది తొలగించిన కారణంగా తిరిగి ఈ సౌకర్యాన్ని కల్పించాలని దుబాయ్/sharjah ట్రావెల్స్ ఫోర్మ్ చైర్మన్‌కు శరత్ యలమర్తి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక వీసా లేకుండ దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారికోసం యూఏఈ ప్రభుత్వం ఆమ్న్‌స్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో టిక్కెట్టు కూడా కొనుకోలేని స్థితిలో ఉన్న ప్రవాస బారతీయులను తిరిగి స్వదేశానికి పంపించడానికి సహాయం సహకారాలు అందించాలని గల్ఫ్ జనసేన ఇంచార్జీ త్రిమూర్తులు కోరారు.

Janasena Party Office Dubai


ఈ సభకు హాజరైన అతిథులు మాట్లాడుతూ.. ఏపీలో తుగ్లక్ పాలను పారద్రోలి, రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటులో NRI ల పాత్ర కీలకం అని కొనియాడారు. ప్రతి ఎన్‌ఆర్ఐకి తాము అండగా ఉంటామని.. ఎటువంటి సహాయం సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు. అనంతరం జన సైనికులు వీర మహిళలు, అతిథుల సమక్షంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.


Also Read:

NRI: కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

NRI: యూఎస్ఏలో ‘అన్నమయ్య డే’! సిలికానాంధ్ర ఆధ్వర్యంలో సంకీర్తనోత్సవం

NRI: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో తెలంగాణ టెకీలకు ప్రాధాన్యత

For More NRI News and Telugu News..

Updated Date - Sep 01 , 2024 | 08:24 PM