Share News

America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'

ABN , Publish Date - May 05 , 2024 | 02:58 PM

భారతీయులు లేకుండా అమెరికా(America) సాంకేతిక పరిశ్రమ(Tech Industry) మనుగడ కష్టమని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ CEO హర్బీర్ కె భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలో ఇన్నోవేషన్స్, కీలక నేతల్లో భారతీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'
US Tech Industry cannot to Survive Without Indians

భారతీయులు లేకుండా అమెరికా(America) సాంకేతిక పరిశ్రమ(Tech Industry) మనుగడ కష్టమని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ CEO హర్బీర్ కె భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలో ఇన్నోవేషన్స్, కీలక నేతల్లో భారతీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 40 శాతం మంది సిలికాన్ వ్యాలీ CEOలు లేదా వ్యవస్థాపకుల్లో దక్షిణ ఆసియా లేదా భారతదేశానికి చెందినవారు ఉన్నారని వెల్లడించారు.


అంతేకాదు మరోవైపు గూగుల్(google), యూట్యూబ్, గూగుల్ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ వంటి కీలక సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని భాటియా చెప్పారు. భారతీయులు శ్రమ, ఉత్పాదకత వంటి అత్యుత్తమ విలువలను పాటిస్తారని తెలిపారు. సిలికాన్ వ్యాలీకి భారత్‌తో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు, వాటి విజయంలో భారతదేశం కీలక పాత్ర పోషించిందని ఆమె అన్నారు.

మరోవైపు మెజారిటీ అవుట్‌సోర్సింగ్ ఇప్పటికీ భారతదేశంతోనే(india) జరుగుతుందన్నారు. అమెరికాలోని ఒక ఉద్యోగి ఖర్చును భారతదేశంలో ముగ్గురు ఉద్యోగులకు ఖర్చు చేస్తారని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌లో టెక్ పరిశ్రమ అభివృద్ధికి భారతీయులు ఎంతో కీలకమన్నారు. సాంకేతికత, వ్యవసాయం లేదా ఆరోగ్య సంరక్షణ వంటి ఏ వృత్తిలోనైనా భారతీయులు అభివృద్ధి చెందగలరని ఆమె వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest NRI News and Telugu News

Updated Date - May 05 , 2024 | 03:03 PM