Tirumala: తిరుమలలో భారీ వర్షం

ABN, Publish Date - Nov 08 , 2024 | 10:39 AM

తిరుపతి జిల్లా: తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో తిరుపతిలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tirumala: తిరుమలలో భారీ వర్షం 1/6

తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తడవకుండా ఓ సత్రం వద్ద నిలుచున్నారు. అలాగే తిరుమాడవాథుల్లో పర్యటనకు వచ్చిన ఏనుగు కూడా సత్రం వద్ద నిలుచుంది.

Tirumala: తిరుమలలో భారీ వర్షం 2/6

తిరుమలలో వర్షం కురుస్తు్న్న నేపథ్యంలో మావటివాళ్లు ఏనుగుకు కప్పిన దుప్పటి కింద తలదాచుకున్న దృశ్యం..

Tirumala: తిరుమలలో భారీ వర్షం 3/6

భారీ వర్షం నేపథ్యంలో తిరుమలలోని ఓ గుడి వద్ద నిలుచున్న భక్తులు..

Tirumala: తిరుమలలో భారీ వర్షం 4/6

శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం బయట వర్షం కురుస్తుండడంతో తడిపోయిన వృద్ధ దంపతులు..

Tirumala: తిరుమలలో భారీ వర్షం 5/6

తిరుమలలో భారీ వర్షం కురుస్తుండడంతో వర్షంలో తడుస్తూ రూములకు వెళుతున్న భక్తులు..

Tirumala: తిరుమలలో భారీ వర్షం 6/6

శ్రీవారి ఆలయం వద్ద భారీ వర్షం.. తమ చిన్నారి తడవకుండా గొడుగు వేసుకుని వెళుతున్న భక్తులు..

Updated at - Nov 08 , 2024 | 10:39 AM