కెనడాలో అంగరంగ వైభవంగా నోవా మల్టీ ఫెస్ట్-2024 వేడుకలు..
ABN, Publish Date - Aug 06 , 2024 | 01:58 PM
కెనడాలో నోవా మల్టీఫెస్ట్-2024 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు వాళ్లు తమ సత్తా చాటారు. హాలిఫాక్స్ డార్ట్మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఈ వేడుకల్లో ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు వివరించారు. అలాగే కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతుకు ముందు ఈ వేడుకలను సీఈవో జోసెఫ్, విశాల్ భరద్వాజ్ బృందం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యంగా కెనడా, స్థానిక భారతీయులు భారీగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున శ్రీమతి శ్రీహరిరెడ్డి చల్లా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 27 వేల మంది హాజరయ్యారు.
Updated at - Aug 06 , 2024 | 01:58 PM