హోటళ్లు, సూపర్ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు

ABN, Publish Date - May 22 , 2024 | 01:41 PM

హైదరాబాద్: నగంరలోని పలు హోటళ్లు, సూపర్ మార్కెట్లపై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లో కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం చాక్లెట్లు లభ్యమయ్యాయి. అలాగే జంబో కింగ్ బర్గర్లో క్వాలిటీ లేని పిజ్జాలు సీజ్ చేశారు. కామత్ హోటల్లో నాణ్యత లేని టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షా గౌస్ హోటల్లో నాసిరకం వంటలతో పాటూ కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించి.. సీజ్ చేశారు.

Updated at - May 22 , 2024 | 01:54 PM