Share News

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:41 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే.. ఇప్పటికే ఒకరిద్దరు కీలక నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు ముహూర్తం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూడా వైసీపీని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీసే పనిలో ఉన్న వైసీపీ పెద్దలకు మరో బిగ్ షాక్ తగిలింది.

టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ..!?



Chandrababu-Oath.jpg

ఎవరు.. ఎక్కడ..!?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్న 13 మంది వైసీపీ కౌన్సిలర్లు రెడీ అయ్యారు. కొలుసు పార్థసారథికి మంత్రి వర్గంలో చోటు దక్కడంతో ఆయన అడుగుల్లో నడిచి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీరంతా ముందడుగు వేశారు. అందుకే.. మంత్రి సమక్షంలో టీడీపీలో చేరేందుకు కౌన్సిలర్లు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి ఊహించని విజయం సాధించడం, విజనరీ లీడర్ సీఎం కావడంతో టీడీపీ కుటుంబంలోకి అడుగు పెట్టేందుకు వైసీపీ గ్రామ సర్పంచ్లు, మండల,నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహాం కనబరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ్రామాల్లో ఇప్పటికే చెరిగిపోయిన వైసీపీ రంగులు, గుర్తులు చెరిగిపోయాయని నియోజకవర్గ స్థాయిలో పెద్ద చర్చే జరుగుతోంది.


Kolusu-Parthasarathy.jpg

ఎమ్మెల్యేల పరిస్థితి ఇదీ..!

వైసీపీలో అంతా అయోమయంగా ఉంది. 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ ఆయా నియోజకవర్గాల క్యాడర్‌లో ఉత్సాహం కనిపించలేదు. కనీసం పార్టీ ఆఫీసులకు వచ్చి క్యాడర్‌ను పలకరించలేని పరిస్థితిలో ఉండటంతో గందరగోళంగానే ఉంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ‘పార్టీలో ఉందామా... జంప్‌ అవుదామా’ అని చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే.. పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నామని పవర్‌ లేకపోవడంతో కోట్ల రూపాయిలు పోసి గెలిచి కూడా ప్రయోజనం లేకపోయిందని నిరూత్సాహ పడుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేల తీరుతో వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే.. అధికారంలోకి రాలేదు సరే గెలిచిన ఎమ్మెల్యేలు తమకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా చేస్తున్నారేంటి..? అని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడిప్పుడేగా అసలు సిసలు సినిమా మొదలైంది.. మున్ముందు ఏమైనా జరగొచ్చు సుమీ..!

TDP-And-YSRCP-Logo.jpg

Updated Date - Jun 14 , 2024 | 01:45 PM