Share News

KK Survey: వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే

ABN , Publish Date - Jun 22 , 2024 | 06:24 PM

కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది...

KK Survey: వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే

అమరావతి: కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది. అదే ఈ ఎన్నికల్లో అక్షరాలా నిజమైంది. ఇక కూటమికి 160 అసెంబ్లీ స్థానాలకు పైగానే వస్తాయని చెప్పడం.. కిరణ్ కొండేటి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అక్షరసత్యాలు అయ్యాయి. దీంతో కేకే సర్వే టీం క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంతకీ ఎవరీ కిరణ్..? ఈయన బ్యాగ్రౌండ్ ఏంటి..? ఇదివరకు ఎన్ని సర్వేలు చేశారు..? అసలు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి..? అని గూగుల్‌లో.. యూ ట్యూబ్‌ ఇంటర్వ్యూల్లో జనాలు తెగ వెతికేస్తున్నారు.

పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!


Kiran-Kondeti.jpg

సన్మానం..!

మరోవైపు.. కేకే ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు..? సర్వే ఎలా చేశారు..? ఏయో నియోజకవర్గంలో ఎన్నెన్ని శాంపిల్స్ తీసుకున్నారు..? చిన్న సంస్థే అయినా ఇంత కచ్చితంగా ఎలా..? అని పెద్ద పెద్ద సర్వే సంస్థలే షాకవుతున్న పరిస్థితి. ఎందుకంటే జాతీయ మీడియా, తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సర్వే సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫలితాల తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన కిరణ్ కొండేటిని పలువురు కూటమి పార్టీల నేతలు సన్మానించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మరీ సన్మానించారు. ఈ సన్మాన సభ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పాల్గొని కేకేకు అభినందనలు తెలిపారు. ఇలాంటి ఖచ్చితమైన సర్వేలు మరెన్నో చేయాలని రాజకీయ నేతలు, మేథావులు.. కేకేకు సూచించారు.


YS-JAgan-And-NDA-Alliance.jpg

కూటమి గెలుపు.. వైసీపీ ఓటమిపై..!

ఈ సన్మాన సభలో భాగంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ.. కూటమి ఎలా గెలిచింది..? వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేంటి..? అనేదానిపై ప్రసంగించారు.సర్వే ఫలితాలు కచ్చితంగా ఉండేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నాం. 2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వస్తాయని చెప్పాం.. అదే అక్షరాలా నిజమైంది. 2024 ఎన్నికలలో 160కి పైగా కూటమికి వస్తాయని చెప్పాం.. అది కూడా సత్యమని తేలింది. సర్వే చేసే సమయంలో అనేక అంశాలను లోతుగా పరిశీలించడం ద్వారా కచ్చితత్వ ఫలితాలు ఇచ్చాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం వల్లే ప్రజాదరణకు దూరమయ్యారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పట్టించుకోలేదు. కూటమి పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల జీవనానికి అవసరమైన దారులు చూపిస్తే పాలకులకు అండగా ఉంటారనేది మా సర్వేలో తేలింది అని మూడు ముక్కల్లో కిరణ్ చెప్పుకొచ్చారు. కొండేటి మాట్లాడుతున్నంత సేపూ సభికులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.

త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?


ఇదిగో కేకే సర్వే..

KK-Survey-With-Figures.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 22 , 2024 | 06:28 PM