Share News

Pawan Kalyan: వైఎస్ జగన్‌కు గట్టిగానే ఇచ్చిపడేసిన పవన్ కల్యాణ్!

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:42 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమాశాలకు ముందు.. సమావేశాల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..! ఆయన యాక్షన్, ఓ వరాక్షన్ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు..

Pawan Kalyan: వైఎస్ జగన్‌కు గట్టిగానే ఇచ్చిపడేసిన పవన్ కల్యాణ్!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇవాళ అసెంబ్లీ సమాశాలకు ముందు.. సమావేశాల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..! ఆయన యాక్షన్, ఓవరాక్షన్ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, అధినేత చేస్తున్న అన్ని విషయాలను ప్రస్తావించి మరీ గట్టిగానే ఇచ్చిపడేశారు పవన్. శాంతి భద్రతలపై వైసీపీ చేస్తున్న ఓవరాక్షన్ మొదలుకుని నిన్న మొన్నటి వినుకొండ హత్య వరకూ అన్నింటిపైనా ఒకే ఒక్క సమావేశంతో సమాధానమిచ్చేశారు సేనాని.


Pawan-Kalyan.jpg

తత్వం బోధ పడలేదా..?

ఎన్నికల ఫలితాలు మొదలుకుని ఇప్పటి వరకూ జగన్ చర్యలు, ఆయన తీరును పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. అధికారం పోయినా.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయినా కూడా వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదా..? అంటూ మండిపడ్డారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటి..? ఇది ఎంతవరకు సబబు..? అని జగన్‌ను పవన్ ప్రశ్నించారు. అంతేకాదు.. ఏపీలో జరుగుతున్న దాడులు, వినుకొండ హత్యను కూడా పరోక్షంగా ప్రస్తావించిన డిప్యూటీ సీఎం.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని కన్నెర్రజేశారు.


YS-Jagan.jpg

రెచ్చగొట్టడమేంటి..?

అసెంబ్లీ సమావేశాలకు వస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్లకార్డులు పట్టుకుని, నల్ల కండువాలతో వస్తున్న వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వారిపైన వైఎస్ జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నానా యాగీ చేశారు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన పవన్.. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవేంటి..? పోనీ వచ్చిన తర్వాత అయినా సైలెంట్‌గా ఉన్నారా..? గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడమేంటి..? ఇదంతా అతని అహంకార ధోరణికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Sasana-Sabha-Samavesam.jpg

వందకు వంద శాతం..!

వైఎస్ జగన్ ఇకనైనా మారాలని పరోక్షంగా పవన్ హెచ్చరించారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి బయటికి రావాలని.. ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? అంటూ సమావేశంలో పవన్ సెటైర్లేశారు..! ఈ సందర్భంగా.. శాంతి భద్రతల విషయంలో, రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే తాను, జనసేన పార్టీ వందకు వంద శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో.. చేరికలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయం తో పాటు చాలా విషయాలపై నిశితంగా చర్చించినట్లుగా తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే.. ఇన్నాళ్లుగా వైసీపీ చేసిన యాక్షన్‌కు పవన్ గట్టిగానే రియాక్షన్ అయ్యారన్న మాట.

Chandrababu-And-Pawan.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2024 | 05:13 PM