Share News

Chandrababu: వైసీపీ వలంటీర్లకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 06:56 PM

AP Volunteer System: వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై (AP Volunteer System) టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పెనుకొండలో జరిగిన ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు.. కొన్ని అపోహలు, పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు...

Chandrababu: వైసీపీ వలంటీర్లకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై (AP Volunteer System) టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పెనుకొండలో జరిగిన ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు.. కొన్ని అపోహలు, పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. టీడీపీ గెలిస్తే.. వలంటీర్లకు చిక్కులే.. ఆ వ్యవస్థే లేకుండా చేస్తారంటూ గత కొన్నిరోజులుగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మొదలుకుని మంత్రులు, నేతలు, కార్యకర్తల వరకూ మెయిన్‌స్ట్రీమ్ మీడియా.. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపారు. దీంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ విషయం టీడీపీ నేతలు కొందరు.. చంద్రబాబుకు చేరవేయడంతో పెనుకొండ సభలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.


Chandrababu-Speechg.jpg

నేనున్నా.. అభయమిస్తున్నా..!

‘మేం అధికారంలోకి వస్తే వలంటీర్లను తీసేయం.. ఎవరి ఉద్యోగం తొలగించం. అసలు ఆ ఆలోచనే చేయం. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాం. మళ్లీ చెబుతున్నా.. తప్పకుండా వలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తాం. వలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. వలంటీర్లు ఎవరూ వైసీపీ కోసం పనిచేయవద్దు..’ అని వలంటీర్లకు చంద్రబాబు అభయం ఇస్తూ.. ఒకింత శుభవార్తే చెప్పారు. అంతేకాదు.. టీడీపీ హయాంలో ఎన్నో ఐఐటీ ఉద్యోగాలు ఇస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కేవలం వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిందని బాబు విమర్శలు గుప్పించారు. బాబు కామెంట్స్‌తో వలంటీర్లలో ఆందోళన.. భయం తొలగినట్లయ్యింది. మొత్తానికి చూస్తే.. ‘రా కదలి రా..’ ముగింపు సభతో వలంటీర్ల వ్యవస్థపై ఇన్నిరోజులుగా వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు.

Chandrababu-And-Pawan.jpg

ఇక.. భయం వద్దు..!

వాస్తవానికి వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పడం ఇదేం మొదటిసారి కాదు. అయితే వైసీపీ మాత్రం వలంటీర్లలో లేనిపోని అనుమానాలు నూరిపోస్తుండటంతో వారిలో భయం మొదలైంది. టీడీపీ గెలిస్తే.. వలంటీర్ల వ్యవస్థ, సంక్షేమ పథకాలు ఇలా ఏవీ రావన్నట్లుగా ఇటీవల కాలంలో పదేపదే వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు పెనుకొండ సభావేదికగా కుండబద్ధలు కొట్టారు. సో.. వలంటీర్లకు నిజంగా ఇది తియ్యటి శుభవార్తే అని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పలుమార్లు వలంటీర్లను కొనసాగిస్తామని.. ఎవరి పొట్టకొట్టమని మాటిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో.. టీడీపీ-జనసేన గెలిస్తే ఇదే వలంటీర్ వ్యవస్థ ఉంటుందన్న మాట. అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ అభయం ఇచ్చారు గనుక.. వలంటీర్లకు ఇక భయమే అక్కర్లేదు.

Volunteers-Jagan.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 06:57 PM