Share News

YSRCP: జంపింగ్‌లు షురూ.. టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ..!?

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:01 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి.

YSRCP: జంపింగ్‌లు షురూ.. టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో (YSRCP) ఓ వెలుగు వెలిగిన కొందరు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి. దీంతో అసలు పార్టీలో ఉండాలా..? వద్దా అని ఆలోచనలో పడిన పరిస్థితి. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి సైకిలెక్కడానికి ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు. వైసీపీ నేతలు మాత్రమే కాదండోయ్.. ఆ పార్టీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారట.


Busine-Virupakshi-1.jpg

అసలేం జరిగింది..?

ఏపీలో టీడీపీ ప్రభజనం సృష్టించినా, స్వల్ప మెజారిటీతో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి విరుపాక్షి గెలుపొందినా... క్యాడర్‌లో స్తబ్ధత నెలకొంది.. ఎక్కడా ఉత్సాహం, సంబరాలు కనిపించలేదు... టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు డీలా పడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్‌ యాక్షన్‌ చేసిన నాయకులు, ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. వాట్సాప్‌ గ్రూప్‌లో, సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టే బ్యాచ్‌లు కనుమరుగై పోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా, మన పనులు జరగవు అని, ఇప్పుడు ఎలా...?? అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు. టీడీపీ నాయకులతో సాన్నిహిత్యం ఉన్న వారి ద్వారా టీడీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి.. పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఇలా జంపింగ్ వార్తలు గుప్పుమంటున్నాయి.


Busine-Virupakshi.jpg

టెన్షన్.. కరువైన ఆనందం!

డీలర్‌ షిప్‌లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో పార్ట్‌ టైం ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని, వాటిని కాపాడుకునేందుకు పార్టీ మారుదామా ప్రధాన క్యాడర్‌ ఆలోచనలో పడ్డినట్లు సమాచారం. అయితే, వైసీపీ గెలుపు కోసం పని చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా అని టీడీపీలోకి చేరాలని చూస్తే తామెందుకు ఒప్పుకుంటామని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్‌లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రభావం కూడా ఆలూరు నియోజకవర్గంపై ఉండటంతో కొందరు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నాయకుల రెడ్‌బుక్‌ ఉందని గమ్మనూర్‌ జయరాం అనుచరులు చెబుతుండటంతో, వైసీపీ నాయకులో టెన్షన్‌ మొదలైంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో గెలిచినా ఆనందం కరువైంది.

Busine-Virupakshi-2.jpg

Updated Date - Jun 14 , 2024 | 12:03 PM