Share News

Viral: జోరున వాన.. కంగారులో 2.6 రేటింగున్న క్యాబ్ బుక్ చేస్తే..

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:37 PM

ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు కొత్త కొత్త స్కామ్‌లకు తెరతీస్తున్నారు. రకరకాల ఐడియాలతో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఓ క్యాబ్ డ్రైవర్‌నే బురడీ కొట్టించి అధిక డబ్బులు చెల్లించే అగత్యం నుంచి తప్పించుకున్నాడో కస్టమర్.

Viral: జోరున వాన.. కంగారులో 2.6 రేటింగున్న క్యాబ్ బుక్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు కొత్త కొత్త స్కామ్‌లకు తెరతీస్తున్నారు. రకరకాల ఐడియాలతో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఓ బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌నే బురడీ కొట్టించి అధిక డబ్బులు చెల్లించే అగత్యం నుంచి తప్పించుకున్నాడో కస్టమర్. అసలేం జరిగిందో చెబుతూ అతడు తాజాగా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది (Viral).

జోరు వాన పడుతుండటంతో తాను తప్పనిసరి పరిస్థితుల్లో 2.6 స్టార్ రేటింగ్ ఉన్న ర్యాపిడో క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ‘‘క్యాబ్ సమీపంలోనే ఉండటంతో బుక్ చేసుకున్నా. నా యాప్‌లో ధర రూ.385గా కనిపించింది. ప్రయాణం పెద్ద సౌకర్యంగా లేకున్నా పర్లేదులే అనుకుని అడ్జస్ట్ అయ్యాను. డ్రాప్ లొకేషన్‌కు రాగానే డ్రైవర్ తన యాప్ కాకుండా ఎప్పుడో సేవ్ చేసుకున్న ఓ స్క్రీన్ షాట్ చూపిస్తూ రూ.600 చెల్లించాలని అన్నాడు. కానీ నా యాప్‌లో మాత్రం రూ.385 కనిపించింది. నేను దారిలో ఎక్కడా ఆగింది లేదు.. క్యాబ్ రూట్‌లో కూడా మార్పు లేదు. దీంతో, అతడు నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది’’

Viral: చేతి కుస్తీ పోటీలు! పుల్లలా విరిగిన చేయి! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!


‘‘కానీ నేను మాత్రం అతణ్ణి అప్పుడే నిలదీయదలుచుకోలేదు. అప్పటికి ట్రిప్ ఇంకా పూర్తికాకపోవడంతో కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసే అవకాశం కూడా లేదు. ఆ తరువాత అధిక ధర గురించి ప్రస్తావిస్తే డ్రైవర్ రకరకాల కారణాలు చెబుతూ నన్ను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. సర్వర్‌లో అప్‌డేట్ అయ్యేందుకు టైం పడుతున్నాడు. నా మెయిల్ చెక్ చేసుకోమన్నాడు. చివరకు కస్టమర్‌ కేర్‌కు కాల్ చేయమన్నాడు. ఈలోపు, మరో అకౌంట్‌లోంచి లాగిన్ అయ్యాడు. ఆ అకౌంట్‌లో ట్రిప్ హిస్టరీ ఏమీ లేదు. దీనికి కూడా సర్వర్‌ లోపం కారణమని అన్నాడు’’

‘‘నేను మాత్రం గట్టిగా ప్రతిఘటించలేదు. నా యాప్‌లో ఏముంటే అంతే ఇస్తానని అన్నాను. దాంతో అతడు దబాయించడం మొదలెట్టాడు. కానీ నేను మాత్రం అంతే మర్యాదగా సమాధానమిస్తూ వచ్చాను’’

Viral: దొంగలున్నారో లేదో తెలుసుకునేందుకు యువతి ప్రయోగం.. షాకింగ్ వీడియో!


‘‘అతను నాతో గొడవ పడటానికి సిద్ధమయ్యాడు. అతడి స్కామ్ అర్థమైన నేను మాత్రం ఏమాత్రం తొందరపడకుండా మెల్లగా మాట్లాడుతూ అతడిని బురిడీ కొట్టే ప్రయత్నం చేశాను. ఒక్కసారి సర్వర్‌కు కనెక్ట్ కాగానే మొత్తం ఇచ్చేస్తానని మెల్లగా చెప్పాను. ఇలా 30 నిమిషాలు గడిచిపోయింది. చివరకు అతడు ఏమనుకున్నాడో ఏమో కానీ అతడు వెళ్లిపోయాడు. డ్రైవర్ వెళ్లిన మరుక్షణమే రైడ్ ఎండైనట్టు నోటిఫికేషన్ వచ్చింది. అందులో ట్రిప్ ధర రూ.385గా కనిపించింది. అతడి స్కామ్ నుంచి తప్పించుకున్నందుకు నాకు కాస్తంత గర్వంగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. ముందస్తుగానే డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ఈ సమస్యలు ఉండవని సలహా ఇచ్చారు. తమకూ ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైందని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Dec 05 , 2024 | 02:42 PM