Share News

Black Neck: మెడ చర్మం నల్లగా ఎబ్బెట్టుగా ఉందా? ఇలా సింపుల్ టిప్స్ తో వదిలించుకోండి..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:17 AM

చాలామంది మహిళలు వివిధ రకాల ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకోవడం, మెడలో చైన్లు, మంగళసూత్రం వంటివి నిత్యం వేసుకుంటారు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని రోజుల్లోనే మెడ ప్రాంతంలో చర్మం నల్లగా మారుతుంది. దీనివల్ల ఎంత అందంగా తయారైనా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది.

Black Neck:  మెడ చర్మం నల్లగా ఎబ్బెట్టుగా ఉందా? ఇలా సింపుల్ టిప్స్ తో వదిలించుకోండి..!
Black Neck

చందమామ లాంటి అందం ఉన్నా సరే.. ఓ చిన్న మచ్చ ఆ అందాన్ని పాడు చేస్తుంది అంటారు. మెడ చర్మం నలుపుగా ఉండటం, కళ్ల కింద నల్లటి వలయాలు, పెదవులు నల్లగా ఉండటం, పెదవుల చుట్టూ నలుపు ఉండటం.. ఇవన్నీ అలాంటివే. చాలామంది మహిళలు వివిధ రకాల ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకోవడం, మెడలో చైన్లు, మంగళసూత్రం వంటివి నిత్యం వేసుకుంటారు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని రోజుల్లోనే మెడ ప్రాంతంలో చర్మం నల్లగా మారుతుంది. దీనివల్ల ఎంత అందంగా తయారైనా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ మెడ నలుపును వదిలించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు ట్రై చేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!


నిమ్మరసం..

నిమ్మరసాన్ని నీటిలో కలిపి మెడకు అప్లై చేయాలి. 10-15 నిమిషాలు అలాగే వదిలి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెడ నలుపు మెల్లగా వదులుతుంది. నిమ్మకాయ సహజమైన బ్లీచ్ గా పనిచేస్తుంది.

పసుపు, పెరుగు..

పసుపు, పెరుగు రెండింటిని మిక్స్ చేసి మెడకు అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల పాటూ అలాగే ఉంచి ఆ తరువాత మెడను శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండుసార్లు ట్రై చేస్తూ ఉంటే ఫలితం తొందరగా ఉంటుంది.

కలబంద..

తాజా కలబంద గుడ్డును మెడ మీద అప్లై చేయాలి. దీన్ని అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది మెడ నలుపు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..


బంగాళదుంప..

బంగాళదుంప గ్రైండ్ చేసి లేదా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని మెడకు పట్టించాలి. దీన్ని 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్..

ఓట్ మీల్ స్ర్కబ్ ను మెడ నలుపు వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఓట్ మీల్ ను నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మెడకు అప్లై చేసి మెడ చర్మం నలుపుగా ఉన్నచోట సున్నితంగా స్క్రైబ్ చేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.

మెంతి మొలకలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?


బాదం నూనె..

బాదం నూనెలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని రిపేర్ చేయడమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పడుకునేముందు కొన్ని చుక్కల బాదం నూనెను మెడ చర్మం మీద వేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే సాధారణంగా శుభ్రం చేసుకోవాలి. సూపర్ ఫలితాలు ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్..

యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి దాన్ని మెడకు అప్లై చేయాలి. దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది మెడ నలుపును ఈజీగా వదిలిస్తుంది.

మెంతినీరు Vs తులసినీరు... ఖాళీ కడుపుతో ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?

ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 20 , 2024 | 08:17 AM