Share News

Viral: నిద్రపోతున్న వ్యక్తి ముక్కులోకి దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 09 , 2024 | 01:59 PM

చైనాకు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను రాత్రి నిద్రపోతున్న సమయంలో ఓ బొద్దింక అతడి ముక్కులోకి ప్రవేశించింది. కొద్ది సేపటికి అతడి గొంతులో ఏదో పాకుతున్నట్టు అతడికి అనిపించింది. గట్టిగా దగ్గాడు. అయినా బయటకు ఏదీ రాలేదు.

Viral: నిద్రపోతున్న వ్యక్తి ముక్కులోకి దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Cockroach

చైనా (China)కు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను రాత్రి నిద్రపోతున్న సమయంలో ఓ బొద్దింక (Cockroach) అతడి ముక్కు (Nose)లోకి ప్రవేశించింది. కొద్ది సేపటికి అతడి గొంతులో ఏదో పాకుతున్నట్టు అతడికి అనిపించింది. గట్టిగా దగ్గాడు. అయినా ఏదీ బయటకు రాకపోవడంతో పెద్దగా పట్టించుకోకుండా నిద్రపోయాడు. తర్వాతి రోజు ఉదయం ఎప్పటిలాగానే ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. రెండ్రోజుల వరకు అతడి పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత అతడి పరిస్థితి దిగజారడం ప్రారంభించింది (Viral News).


మూడో రోజు అతడి శ్వాసనాళం నుంచి ఏదో దుర్వాసన రావడం ప్రారంభమైంది. బ్రష్ చేయడం, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చికిత్స తీసుకున్నా, నోటి దుర్వాసన మాత్రం తగ్గలేదు. పసుపు నీటితో నోటిని పుక్కిలించినా అతడి పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు అతడు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌‌కు చెందిన హైనాన్ అనే వ్యక్తి ఆసుపత్రికి వెళ్లి ఈఎన్‌టీ డాక్టర్‌ను కలిశాడు. లోపల ఏదో ఉందని గుర్తించిన డాక్టర్ ఛాతీకి సీటీ స్కాన్ తీశాడు. కుడి ఊపిరితిత్తు దిగువన ఉన్న ట్యూబ్‌లో ఏదో వస్తువు ఉన్నట్టు గుర్తించారు.


తదుపరి విచారణ కోసం వ్యక్తి బ్రోంకోస్కోపీ చేయించుకోగా రెక్కలతో ఉన్న ఏదో కీటకం ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు గుర్తించారు. చివరకు అది బొద్దింక అని కనుగొన్నారు. తర్వాత ఆపరేషన్ చేసి బొద్దింకను బయటకు తీసి ఆ భాగం మొత్తాన్ని క్లీన్ చేశారు. తర్వాత ఆ రోగికి దుర్వాసనం రావడం తగ్గింది. తర్వాతి రోజే ఆ వ్యక్తిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఇలాంటి కేసులలో ఎంత త్వరగా వైద్య సహాయం అందితే అంత మంచిదని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. ఆఫీస్‌కు ఇలా వెళ్లే రోజు వస్తుందా?.. వీళ్లు ఆఫీస్‌కు ఎలా వెళ్తున్నారో చూడండి..


Viral Video: ఊపిరి బిగబట్టి చూడాల్సిన వీడియో.. కూతురి కోసం ట్రైన్ కిందకు తల్లి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డారంటే..


Optical Illusion: ఈ ఫొటోలోని ``Rug`` ఎక్కడుందో కనిపెట్టండి.. మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఓ బాలిక తన తల్లిని ఎలా కాపాడిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 09 , 2024 | 02:00 PM