Viral: బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్లు, మెసేజ్‌లు.. లిఫ్ట్ చేయకపోతే వింత పనులు.. చివరకు డాక్టర్లు ఏం తేల్చారంటే..
ABN , Publish Date - Apr 24 , 2024 | 02:15 PM
ప్రేమ ఒక మత్తు లాంటిది. ప్రేమలో పడిన వారు ఎక్కువ సమయం ప్రియమైన వారి ధ్యాసలోనే ఉంటారు. వీలైనప్పుడల్లా కాల్స్, మెసేజ్‌లు చేస్తుంటారు. అంతవరకు ఫర్వాలేదు గానీ, శృతి మించితే మాత్రం ప్రమాదమే. ఈ ప్రేమ మరీ ఎక్కువైపోతే ఇద్దరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చైనాకు చెందిన ఓ 18 ఏళ్ల యువతి ప్రియుడి ధ్యాసలో పడి అనారోగ్యానికి గురైంది.
ప్రేమ (Love) ఒక మత్తు లాంటిది. ప్రేమలో పడిన వారు ఎక్కువ సమయం ప్రియమైన వారి ధ్యాసలోనే ఉంటారు. వీలైనప్పుడల్లా కాల్స్, మెసేజ్‌లు చేస్తుంటారు. అంతవరకు ఫర్వాలేదు గానీ, శృతి మించితే మాత్రం ప్రమాదమే. ఈ ప్రేమ మరీ ఎక్కువైపోతే ఇద్దరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చైనా (China)కు చెందిన ఓ 18 ఏళ్ల యువతి ప్రియుడి ధ్యాసలో పడి అనారోగ్యానికి గురైంది. ప్రియుడి పట్ల అధిక ప్రేమను పెంచుకుని ఆస్పత్రి పాలైంది. ఆమె బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో (Borderline Personality Disorder) బాధపడుతున్నట్లు వైద్యులు భావిస్తున్నారు (Viral News).
చైనాకు చెందిన 18 ఏళ్ల జియోయు అనే యువతి ఓ విశ్వ విద్యాలయంలో చదువుతోంది. ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది. అది తీవ్ర రూపం దాల్చి పిచ్చి ప్రేమగా మారింది. అతను ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఎప్పుడూ కాల్స్, మెసేజ్‌లు చేస్తుండేది. ఆమె ప్రవర్తనతో ప్రియుడు విసిగిపోయాడు. ఇటీవల ఒకరోజు 100 సార్లు అతడికి కాల్ చేసింది. అయినా ఆ యువకుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇంట్లోని వస్తువులను నాశనం చేసింది.
ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకడానికి ప్రయత్నించింది. ఆమె ప్రవర్తన గురించి యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు తేల్చారు. చిన్న వయసులో తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేని పిల్లలు ఇలాంటి సమస్యతో బాధపడతారని, ఎమోషనల్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లతో దీని నుంచి బయటపడవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష బాస్.. ఈ ఫొటోలోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..