Share News

Viral News: రైతు నివాసంలో రూ. కోట్లు చోరీ.. దొంగలను పట్టించ్చిన కుక్క

ABN , Publish Date - Oct 18 , 2024 | 07:14 PM

పంట భూమిని కోనుగోలు చేసేందుకు అతడు ఆ యజమానితో సంప్రదింపులు జరిపాడు. అనంతరం రైతు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు తన ఇంటికి వచ్చి చూసే సరికి.. నగదు కనిపించ లేదు. దీంతో తన నివాసంలో చోరీ జరిగిందని గ్రహించాడు.

Viral News: రైతు నివాసంలో రూ. కోట్లు చోరీ.. దొంగలను పట్టించ్చిన కుక్క

ఓ రైతు ఇంట్లో కోట్ల రూపాయిల నగదు చోరీ చేసిన ఘటనలో దొంగల గుట్టును పోలీస్ జాగిలం రట్టు చేసింది. ఈ ఘటన గుజరాత్‌లో గతవారం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ జిల్లాలోని ఓ రైతు.. లోథల్ ప్రాంతంలో తన పంట భూమిని రూ. 1.07 కోట్లకు విక్రయించాడు. ఆ నగదును తన నివాసంలో భద్రపరిచాడు. అయితే మరో ప్రాంతంలో భూమికి కోనుగోలు చేయాలని సదరు రైతు నిర్ణయించాడు. ఆ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన తన ఇంటికి తాళం వేసి... ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వెళ్లాడు.

Also Read: Dhanteras 2024: ధనత్రయోదశి నుంచి దశ తిరగనున్న రాశులివే..


పంట భూమిని కోనుగోలు చేసేందుకు అతడు ఆ యజమానితో సంప్రదింపులు జరిపాడు. అనంతరం రైతు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు తన ఇంటికి వచ్చి చూసే సరికి.. నగదు కనిపించ లేదు. దీంతో తన నివాసంలో చోరీ జరిగిందని గ్రహించాడు.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు రంగం సిద్ధం


దీంతో రైతు పోలీసులను ఆశ్రయించాడు. దాంతో కోటా పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆ ప్రాంతంలో దాదాపు 30 మంది అనుమానితులతోపాటు 14 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అంతలో పోలీసుల శిక్షణ పొందిన జాగిలం.. పెన్నీని గురువారం రంగంలోకి దింపారు. చోరీ జరిగిన ఇంటి నుంచి దొంగలు వెళ్లిన మార్గాన్ని పెన్నీ అనుసరించింది. అలా కొద్ది దూరం వెళ్లిన ఆ జాగిలం.. ఓ ఇంటి వద్ద ఆగింది.

Also Read: Atla Tadde: ఆ దోషం తొలగాలంటే.. అట్లతద్ది రోజు ఇలా చేయండి..


దీంతో ఆ ఇంట్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 53.9 లక్షలను పోలీసులు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇంట్లో నివసిస్తున్న బుద్దా సోలంకినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని పోలీసులు విచారించారు. అయితే ఈ చోరీ చేసింది తామేనని బుద్దా సోలంకి ఒప్పుకున్నాడు. ఈ చోరీని విక్రమ్‌ సోలంకితో కలిసి చేసినట్లు వివరించారు. ఈ చోరీలో దొంగలించిన సొమ్మును తామిద్దరం చెరిసగం పంచుకున్నట్లు తెలిపారు. అలాగే రైతు నివాసంలో ఈ నగదును ఎలా దొంగించింది అతడు వివరించాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి.ఎన్. గోహిల్ పేర్కొన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 18 , 2024 | 07:15 PM