Share News

45 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్! కష్టపడి రూ.5.35 కోట్లు కూడబెడితే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:54 PM

తన జీతంలో వీలైనంత ఎక్కువగా పొదుపు చేసి రిటైర్ అయిపోవాలనుకున్న ఓ జపాన్ వ్యక్తికి చివర్లో భారీ షాక్ తగిలింది.

45 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్! కష్టపడి రూ.5.35 కోట్లు కూడబెడితే..

ఇంటర్నెట్ డెస్క్: చిన్న వయసులో రిటైర్ కావాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వేగంగా డబ్బు సంపాదించాలి. కావాల్సినంత కూడబెట్టుకున్నాక హ్యాపీగా గుడ్‌బై చెప్పేయాలి. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన వ్యూహం పన్నాడు. వీలైనంతగా పొదుపు చేసి రిటైర్ కావాలనుకున్నాడు. అతడి వ్యూహం చాలా వరకూ ఫలించినా చివరి నిమిషంలో బెడిసికొట్టింది. దీంతో, కలలన్నీ చెదిరిపోవడంతో అతడు మళ్లీ తన వృత్తి జీవితం కొనసాగించాల్సి వచ్చింది.

Viral: 13వ అంతస్తు నుంచి పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ! వైరల్ వీడియో!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, సంపాదన ఓ మోస్తరుగా ఉన్నా కడుపూకాలూ కట్టుకుని డబ్బు పొదుపు చేస్తే సులువుగా రిటైర్ అయిపోవచ్చని జపాన్ వ్యక్తి నమ్మకం. ఇందుకోసం అతడు కనీవినీ ఎరుగని రీతిలో పొదుపు ప్రారంభించాడు. 45 ఏళ్లకు రిటైర్ కావాలంటే దాదాపు రూ.5.35 కోట్లు కావాలనుకున్నాడు. ఇందుకోసం కంపెనీలో రోజూ ఓవర్‌టైమ్‌ పనిచేసి డబ్బులు కూడబెట్టాడు. ఖర్చులనూ అసాధారణ రీతిలో తగ్గించుకున్నాడు. నచ్చిన ఆహారం ఏ రోజూ తినలేదు. గిన్నెడు అన్నం, రుచీపచీలేని కూరతో సరిపెట్టుకున్నాడు. ఆఫీసులోనే ఓ చిన్న గదిని అతి తక్కువ ధరకు అద్దెకు తీసుకుని అందులోనే మకాం పెట్టాడు.

Viral: ఈ పిల్ల సింహం నిజంగా లక్కీ! ఒక్కసారిగా అడవి దున్నల గుంపు దాడి చేస్తే..


1.jpgమైక్రోవేవ్ ఒవెన్ చెడిపోతే స్నేహితుడి ఇంట్లో వంట చేసుకుని తిన్నాడు. ఎండాకాలంలో ఏసీకి బదులు తడిపిన టీషర్లులు వేసుకుని సేద తీరాడు. ఇక చలికాలంలో కసరత్తులు చేసి ఒంట్లో వేడిని పెంచుకున్నాడు. ఇలా దాదాపు 20 ఏళ్ల పాటు జీవించాడు. చివరకు అతడు కోరుకున్నమొత్తాన్ని దాదాపుగా కూడబెట్టుకున్నాడు.

Viral: గంటలకొద్దీ ఒకే చోట నిలబడ్డ గుర్రంతో ఫొటో కోసం ట్రై చేస్తే.. !

ఇంతలో ఊహించని ఘటన జరిగింది. జపాన్ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో, అతడు కూడబెట్టుకున్న సొమ్ము విలువ కూడా అదే స్థాయిలో పడిపోయింది. ఈ దెబ్బకు కలలన్నీ కరిగిపోయాయి. చివరకు అతడు మళ్లీ పనిలోకి దిగాల్సి వచ్చింది. జీవితంలో చాలా కాలం నిస్సారంగా గడిచిపోయినా ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. ఇక ఇదే మార్గంలో తన గమ్యం చేరుకునేందుకు అతడు గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇక మీడియాలో అతడి కథనం వైరల్ కావడంతో జనాలు విస్తుపోతున్నారు. అతడికి చిన్న వయసులో రిటైర్మెంట్ ఇక కలగానే మిగిలిపోతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. నెట్టింట కూడా ఈ ఉధంతం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Viral: ఫ్యాక్టరీ మూతపడ్డాక ఉద్యోగులు కనిపించట్లేదని ప్రకటన! ఎందుకో తెలిస్తే..

Read Viral and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 05:10 PM