Share News

Viral: వరద వస్తుందని ముందు జాగ్రత్త.. రూ.45 వేలు ఖర్చు పెట్టి మరీ ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:55 AM

వర్షాకాలం వచ్చిందంటే కొంత మంది బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భారీ వర్షం కురిస్తే చాలు నీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తోంది. ఇక, ఆ వరద తగ్గే వరకు ఆ నీటిలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది.

Viral: వరద వస్తుందని ముందు జాగ్రత్త.. రూ.45 వేలు ఖర్చు పెట్టి మరీ ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!
unique trick to avoid flood damage

వర్షాకాలం (Rains) వచ్చిందంటే కొంత మంది బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భారీ వర్షం కురిస్తే చాలు నీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది (Flood Damage). ఇక, ఆ వరద తగ్గే వరకు ఆ నీటిలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది. ఎన్నో విలువైన వస్తువులు తడిసిపోయి పాడైపోతుంటాయి. ముఖ్యంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కొన్ని మంచం, సోఫాలు, కుర్చీలు వంటి ఫర్నిచర్ ధ్వంసమవుతుంది. అందుకే ఓ వ్యక్తి విభిన్నమైన ప్లాన్ వేశాడు (Viral News).


పంజాబ్ (Punjab) నగరంలోని లోతట్టు ప్రాంతాలలో ఒకటైన పాటియాలా (Patiala) అర్బన్ ఎస్టేట్ నివాసితులు చాలా మంది వరద నష్టం నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఆ ప్రాంతానికి చెందిన అమర్‌జీత్ అనే వ్యక్తి తన ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్‌ (Furniture)ను వరద నీటి నుంచి రక్షించుకునేందుకు ఓ వెరైటీ ప్లాన్ వేశాడు. ఫర్నిచర్ అంతా ఫ్లోరింగ్‌కు రెండడుగుల ఎత్తులో ఉండేలా ఇనుముతో కోణాలు తయారు చేయించాడు. వాటిపై మంచం, సోఫాలను ఉంచాడు. ఆ మంచం పైకి ఎక్కాలంటే ఎవరైనా ఓ కుర్చీ వేసుకొని ఎక్కాల్సిందే. ఇనుముతో ఈ కోణాలను తయారు చేయించేందుకు ఏకంగా రూ.45 వేలు ఖర్చుపెట్టాడు.

flodd2.jpg


అమర్‌జీత్ మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోని ఇతర నివాసితులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు పడితే పాటియాలకు సమయంలో ఉన్న ఘగ్గర్ నదితోపాటు చోటి నది, బడి నది వంటివి పొంగి ప్రవహిస్తుంటాయి. గతేడాది వర్షాల కారణంగా పాటియాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం పంట అంతా కొట్టుకుపోయింది.

ఇవి కూడా చదవండి..

Word Puzzle: ఈ పజిల్‌లోని అక్షరాల మధ్య ఓ పదం దాక్కుంది.. 6 సెకెన్లలో దానిని కనిపెట్టండి..!


Viral Video: సీఏలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయలమ్మే మహిళ కొడుకు.. ఆ తల్లి ఎంతో ఆనంద పడిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 08:55 AM