Share News

Mashco Piro: కెమెరాకు చిక్కిన ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ప్రజలు.. అరుదైన ఫొటో, వీడియోలు ఇవిగో

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:13 PM

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎవరి కంట పడకుండా పెరూలోని అమెజాన్‌ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. ఆ తెగకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలను ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ విడుదల చేసింది.

Mashco Piro: కెమెరాకు చిక్కిన ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ప్రజలు.. అరుదైన ఫొటో, వీడియోలు ఇవిగో
Mashco Piro

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎవరి కంట పడకుండా పెరూలోని అమెజాన్‌ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. ఆ తెగకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలను ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ విడుదల చేసింది. దట్టమైన అడవుల్లోంచి ‘మాష్కో పిరో’ తెగ సమూహం ఒక నది ఒడ్డున సేదతీరడం ఫొటోలు, వీడియోల్లో కనిపించింది. ‘మాష్కో పిరో’ తెగకు సంబంధించిన జాడ, వారి జీవనంపై ఆందోళనలు రేకెత్తుతున్న వేళ ఈ దృశ్యాలు వెలుగుచూశాయి. బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ పెరువియన్ ప్రావిన్స్‌లోని మాడ్రే డీ డియోస్‌లోని నది ఒడ్డున జూన్ చివరలో ఈ ఫొటోలను తీసినట్టు ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ రిపోర్ట్ పేర్కొంది.


Untitled-6.jpg

కలప కోసం చెట్లు నరికేవారు తమ కార్యకలాపాలను మొదలుపెట్టబోతున్న ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ‘మాష్కో పిరో’ తెగ పెద్ద సంఖ్యలో కనిపించారని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కరోలిన్ పియర్స్ వెల్లడించారు. మోంటే సాల్వాడో అనే గ్రామానికి చెందిన యిన్ అనే జాతి ప్రజలు ఇటీవల తాము 50 మందికి పైగా మాష్కో పిరో వ్యక్తులను చూశామని చెప్పారు. ఇక మరో 17 మందితో కూడిన సమూహం అక్కడికి సమీపంలోని ప్యూర్టో న్యూవో అనే గ్రామంలో కనిపించిందని మరో ఎన్‌జీవో తెలిపింది.


Untitled-5.jpg

కాగా స్థానిక హక్కుల సంస్థ ‘ఫెనామద్’ (FENAMAD) ప్రకారం.. ఈ ప్రాంతంలో చెట్ల నరికివేత కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయని, పర్యవసానంగా గిరిజనులు వారి సాంప్రదాయ భూములకు దూరమవుతున్నారని, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కోసం జవాసాలకు దగ్గరగా వస్తున్నట్టుగా అనిపిస్తోందని పేర్కొంది. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా నివసిస్తు్న్న అతిపెద్ద ఆటవిక తెగగా ‘మాస్కో పిరో’ను గుర్తించారు.


కాగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ‘మాస్కో పిరో’ తెగ వారు అరుదుగా కనిపిస్తుంటారని, ఎవరితో పెద్దగా సంభాషించరని సర్వైవల్ ఇంటర్నేషనల్ తెలిపింది. మాష్కో పిరో నివసించే భూభాగంలో రాయితీలు పొందుతున్న అనేక కలప కంపెనీలు తమ కార్యకలాపాలను విరివిగా కొనసాగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అద్భుతమైన క్యాచ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!

కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..

For more Viral News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 01:14 PM