Viral: ``టీచర్.. ఐ లవ్యూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా``.. స్టూడెంట్ షాకింగ్ ప్రపోజల్‌కు మేడమ్ రిప్లై ఏంటంటే..
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:06 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్ క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు. అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్స్ (Student) క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు (Oline Class). అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే (Teacher) విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో టీచర్‌కు ఓ స్టూడెంట్ లవ్ ప్రపోజల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (Student proposed to his teacher).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ టీచర్ పాఠం పూర్తయిన తర్వాత ఓ విద్యార్థి మాట్లాడాడు. చాలా అమాయకంగా మాట్లాడుతూ.. ``మీకు పెళ్లైందా`` అని టీచర్‌ను అడిగాడు. అందుకు ఆ టీచర్ ``లేదు`` అని సమాధానం చెప్పారు. వెంటనే ఆ విద్యార్థి.. ``నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను`` అని చెప్పాడు. దానికి ఆ టీచర్ స్పందిస్తూ.. ``నేను మిమ్మల్నందరినీ ప్రేమిస్తున్నా`` అని రిప్లై ఇచ్చారు. అప్పుడు స్టూడెంట్ ``మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా`` అని రెట్టించాడు. ఆ ప్రశ్నకు టీచర్ బదులివ్వకుండా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. సిగ్గుపడాలి``, ``ఇవన్నీ ఆన్లైన్ క్లాస్‌ల సైడ్ ఎఫెక్ట్స్``, ``ఆ టీచర్ చాలా హుందాగా ప్రవర్తించారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..