Share News

Viral: మీ కంటిచూపు పదునెంత? 5 సెకెన్లలో ఈ ఫోటోలో పిల్లిని కనిపెడితే మీ చూపు భేష్..!

ABN , Publish Date - Jan 16 , 2024 | 03:55 PM

ఓ ఫోటో కంటిచూపుకు ఛాలెంజ్ విసురుతోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో పిల్లిని 5సెకెన్లలో కనుక్కుంటే మీ చూపుకు పదునెక్కువే..

Viral: మీ కంటిచూపు  పదునెంత? 5 సెకెన్లలో ఈ ఫోటోలో పిల్లిని కనిపెడితే  మీ చూపు భేష్..!

చిన్నప్పుడు సరదాగా పజిల్స్ పూర్తీ చేయడం, చుక్కలతో దారి కలపడం వంటివి చేసేవారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇవి కూడా అప్డేట్ అయ్యాయి. గజిబిజిగా ఉన్న చిత్రంలో ఎక్కడో దాగున్న వస్తువులను, జంతువులను కనుక్కోవడం, ఒక బొమ్మలో దాగున్న మరో బొమ్మను గుర్తించడం వంటివి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇవి కంటి చూపుకు, ఆలోచనా శక్తికి కూడా చాలా పని పెడతాయి. నిజానికి ఇలాంటివి ప్రాక్టీస్ చెయ్యడం వల్ల మెదడు పనితీరు, చూపు కూడా పదునెక్కుతాయి. ఇప్పుడు ఓ ఫోటో కంటిచూపుకు ఛాలెంజ్ విసురుతోంది. ఇక్కడ ఇచ్చిన ఫోటోలో పిల్లిని కేవలం 5 సెకెన్లలో కనిపెడితే మీ చూపు భేష్ అని లెక్క(find cat in the photo in 5 seconds).

ఈ కంటిచూపు పరీక్షకు ఇచ్చిన ఫోటోలో ఒక ఇంటి పెరడు ప్రాంతం ఉంది. అక్కడ పికప్ ట్రక్, దాని వెనుక ఇల్లు, చెట్లు ఉన్నాయి. ఈ ఫోటోలో పిల్లిని కేవలం 5 సెకెన్లలో కనుక్కోవడం అందరి ముందు ఉన్న ఛాలెంజ్. అయితే చాలామంది ఈ పరీక్షలో చేతులెత్తేస్తున్నారు. ఇంటి పైకప్పు, కిటికీలు, చెట్లు, పికప్ ట్రక్, దాని కింద భాగం ఇలా ఎక్కడ చూసినా పిల్లి కనిపించలేదు. కేవలం 5సెకెన్లలో పిల్లిని కనిపెట్టలేకపోతున్నాం అని ఓటమి అంగీకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

eye2.jpg


సరిగ్గా గమనిస్తే ఈ ఫోటోలో పికప్ పార్క్ లో పిల్లి తల సగభాగం నలుపురంగులో కనిపిస్తుంది. చాలా నిశితంగా పరిశీలిస్తే తప్ప దీన్ని ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. కానీ ఇలాంటి ఫోటోలు, పజిల్స్ పరిష్కరిస్తే అటు కంటిచూపు, ఇటు మెదడు పదునెక్కుతాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులను చూసి పిల్లలు తొందరగా నేర్చుకునే అలవాట్లు ఇవే..!

Updated Date - Jan 16 , 2024 | 03:59 PM