Share News

Viral Video: వాహ్! ఏమి తెలివి గురూ.. ఏసీని ఇతనెంత సింపుల్ గా తయారుచేశాడో చూస్తే అవాక్కవుతారు!

ABN , Publish Date - May 22 , 2024 | 02:02 PM

సగటు దిగువ తరగతి, పేద పౌరులకు ఏసీలు కొనడం అంటే సామాన్య విషయం కాదు. అలాగని మండే ఎండలను అలాగే భరించలేరు కూడా. అలాంటి సమయంలోనే వారిలో ట్యాలెంట్ బయటికొస్తుంది. మండే ఎండలకు చెక్ పెట్టడుతూ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సింపుల్ గా ఏసీ తయారుచేశాడు.

Viral Video: వాహ్!  ఏమి తెలివి గురూ.. ఏసీని ఇతనెంత సింపుల్ గా తయారుచేశాడో చూస్తే అవాక్కవుతారు!

ప్రతి ఏడూ ఎండల తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎండల బాధ భరించలేక చాలామంది ఎయిర్ కూలర్లు, ఏసీ లు కొనుగోలు చేస్తారు. కానీ సగటు దిగువ తరగతి, పేద పౌరులకు ఏసీలు కొనడం అంటే సామాన్య విషయం కాదు. అలాగని మండే ఎండలను అలాగే భరించలేరు కూడా. అలాంటి సమయంలోనే వారిలో ట్యాలెంట్ బయటికొస్తుంది. మండే ఎండలకు చెక్ పెట్టడుతూ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సింపుల్ గా ఏసీ తయారుచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇతని ట్యాలెంట్ కు ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ అతను ఏసీని ఎలా తయారచేశాడో తెలుసుకుంటే..

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!


అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటారు. దానికి ఉదాహరణగా సోషల్ మీడియాలో బోలెడు వీడియోలు దర్శనిస్తాయి. రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ కోవలోకి వస్తాడు. ఎండల బాధ భరించలేక అతను సింపుల్ గా ఏసీ తయారుచేశాడు. దీని కోసం అతను సాధారణ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్, ఇటుకలు, నీరు ఉపయోగించాడు. టేబుల్ ఫ్యాన్ ముందు ఒక ప్లాస్టిక్ టబ్ లో ఇటుకలు పేర్చాడు. ఆ ఇటుకల మీద నిరంతరంగా వాటర్ సప్లై అయ్యేలా సెట్ చేశాడు. ఫ్యాన్ గాలి ఇటుకల మీద నుండి వీస్తూ చల్లదనాన్ని ఇస్తోంది. ఇది గదిలోని వేడిని మొత్తం తగ్గించి గదిని చల్లబరుస్తోంది అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను adpdeshpande అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఏసీ తయారు చేసిన వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 22 , 2024 | 02:47 PM