Share News

White Hair: తెల్లవెంట్రుకలు కనబడగానే లాగేస్తుంటారా? అలా చేస్తే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:01 PM

నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో లాగేస్తారు. కానీ అలా చేస్తే జరిగేదిదే..

White Hair: తెల్లవెంట్రుకలు కనబడగానే లాగేస్తుంటారా? అలా చేస్తే ఏం జరుగుతుందంటే..!

ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. కానీ ఇలా తెల్లవెంట్రుకలు లాగేయడం అస్సలు మంచిది కాదని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు. అసలు తెల్లవెంట్రుకలు ఎందుకొస్తాయి? తెల్లవెంట్రుకలు లాగేస్తే జరిగేదేంటి?

తెల్లవెంట్రుకలు రావడానికి కారణాలు..

జుట్టులో ప్రతి వెంట్రుక మూలానికి మెలనోసైట్స్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి కణాలు ఉంటాయి. ఈ కణాలు తగ్గడం వల్ల మెలనిన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీని కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది.

ఇది కూడా చదవండి: చిటికెడు జాజికాయ పొడిని రోజూ తీసుకుంటే.. జరిగేదిదే..!


తెల్లవెంట్రుకలు లాగడం వల్ల కలిగే నష్టాలు..

తలలో దురద మంట..

వెంట్రుకలను లాగడం వల్ల వెంట్రుకలు ఊడిరావడం, వెంట్రుకలు విరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల తలలో దురద, మంట, నెత్తిమీద దద్దుర్లు వస్తాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది.

ఇన్ఫెక్షన్..

వెంట్రుకలు లాదినప్పుడు తలలో కలిగే దద్దుర్లు కాస్తా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. దురద పెట్టినప్పుడు పదే పదే తల గోకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతుంది. దీనికి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే తల చర్మం మొత్తం ఇన్ఫెక్షన్ కు గురవుతుంది.

ఇది కూడా చదవండి: Millet vs Wheat: మిల్లెట్స్ రోటీలు మంచివా? గోధుమ రోటీలు బెస్టా? ఆరోగ్యానికి ఏవి మంచివంటే..!


జుట్టు పెరుగుదల..

తెల్లవెంట్రుకలు లాగడం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారిపోతాయి. ఈ కారణంగా జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది.

హైపర్ పిగ్మెంటేషన్..

తెల్లవెంట్రుకలను లాగుతూ ఉంటే వాటిస్థానంలో కొత్త వెంట్రుకలు పెరగవు. వాటి బదులు నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి. ఇది జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 07 , 2024 | 10:01 PM