Share News

Viral: 13వ అంతస్తు నుంచి పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ! వైరల్ వీడియో!

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:08 PM

అదృష్టం ఉంటే మరణాన్ని కూడా జయించొచ్చనేందుకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏకంగా 13వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ మహిళ అదృష్టం కలిసి రావడంతో అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడింది.

 Viral: 13వ అంతస్తు నుంచి పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ! వైరల్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఉంటే మరణాన్ని కూడా జయించొచ్చనేందుకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏకంగా 13వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ మహిళ అదృష్టం కలిసి రావడంతో అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడింది. అంతెత్తునుంచి పడ్డా స్వల్ప గాయాలు మాత్రమే అయిన ఘటన తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ ((Viral)అవుతోంది.

Viral: 17 రోజుల టూర్ తరువాత ఇంటికొచ్చిన మహిళకు భారీ షాక్!


రష్యాలోని నోవోసిబ్రిస్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించినదాని ప్రకారం, 13వ అంతస్తు నుంచి పడ్డ ఓ మహిళ అనూహ్యంగా నేలమీద దట్టంగా మొలిచిన గడ్డిపై పడింది. దీంతో, అనూహ్యంగా ఆమె ప్రాణాలను దక్కించుకుంది. అంత ఎత్తు నుంచి పడ్డందుకు క్షణకాలం ఇబ్బంది పడ్డ మహిళ ఆ తరువాత వెంటనే లేచి కూర్చుంది. ఆమెకు ఎటువంటి దెబ్బలూ తగల్లేదని ఆమె స్నేహితురాలు స్థానిక మీడియాకు తెలిపింది. ఆ తరువాత ఆమె నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ ఎక్కిందని ఆమె స్నేహితురాలు కూడా చెప్పింది. దీంతో, ఈ వార్త స్థానికంగా దావానలంలా వ్యాపించింది. ఈ ఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజీ కూడా వైరల్‌గా మారింది.

Viral: గంటలకొద్దీ ఒకే చోట నిలబడ్డ గుర్రంతో ఫొటో కోసం ట్రై చేస్తే.. !


ఇక వీడియోపై నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది నిజంగా దైవఘటనే అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటిది ముందెన్నడూ చూడలేదని పలువురు కామెంట్ చేశారు. గడ్డి చాలా దట్టంగా ఉండడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పుకొచ్చారు. మరికొందరేమో సెటైర్లు పేల్చారు. ఆమె గాల్లో ఉండగా దేవుడు మనసు మార్చుకుందని కామెడీ చేశారు. ఆమె ఎక్స్ మెన్ సినిమాల్లోని మ్యూటెంట్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కొందరు మాత్రం ఘటనపై సందేహాలు వ్యక్తం చేశారు. అసలు ఆమె నిజంగా అంత ఎత్తు నుంచి కిందపడిందా అన్న సందేహం కూడా వ్యక్తం చేశారు. కాగా, గతంలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగు చూశాయి. తీవ్ర ప్రమాదాల బారిన పడినా కూడా వెంట్రుక వాసిలో బయటపడ్డారు.

Viral: ఫ్యాక్టరీ మూతపడ్డాక ఉద్యోగులు కనిపించట్లేదని ప్రకటన! ఎందుకో తెలిస్తే..

Read Viral and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 04:11 PM