Share News

Weight Loss: నచ్చింది తింటూనే 30 కేజీలు తగ్గిన యువతి.. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోలు వైరల్.. సీక్రెట్ డైట్ ఇదే

ABN , Publish Date - Nov 19 , 2024 | 07:20 PM

సన్నబడాలంటే కఠినమైన డైట్ లు, జిమ్ వర్కవుట్ లు చేయాల్సిన అవసరం లేదని.. నచ్చింది తింటూనే బరువు తగ్గొచ్చని ఈ అమ్మాయి రుజువు చేసింది.. ఆమె చెప్పిన సీక్రెట్ ఏంటంటే..

Weight Loss: నచ్చింది తింటూనే 30 కేజీలు తగ్గిన యువతి.. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోలు వైరల్.. సీక్రెట్ డైట్ ఇదే
Weight Loss

అధికబరువు ఇప్పుడు ఎంతో మందిని కలవరపెడుతున్న సమస్య. ఒక్కసారి అధిక కేలరీలు ఒంట్లో చేరితే ఇక వాటిని వదిలించుకునేందుకు జీవితాంతం జిమ్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. బరువు తగ్గే డైట్ కోసం న్యూట్రిషియన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఇలా ఎవరేం చెప్పినా అది ఫాలో అయిపోతుంటారు. అయితే, తాజాగా ఓ యువతి నచ్చింది తింటూనే ఏకంగా 30 కేజీల బరువుతగ్గింది. ఇందుకు సంబంధించిన వెయిట్ లాస్ జర్నీని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఆమె బిఫోర్ ఆఫ్టర్ ఫొటోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. నువ్వింతకీ ఏం తింటావో చెప్పాలంటూ ఆమెకు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆమె తన 7డేస్ డైట్ ప్లాన్ ను నెటిజన్లతో షేర్ చేసుకుంది. తులసీ నితిన్ అనే యువతి ఇన్ స్టాగ్రామ్ లో తనను తాను డైట్ కోచ్, వెయిట్ లాస్ ఎక్స్ పర్ట్ గా పేర్కొంది. బరువు తగ్గేందుకు తాను ఫాలో అయిన 7 డేస్ డైట్ ను తెలిపింది.


సోమవారం..

ఉదయం 10:00 గంటలకు

పనీర్ స్టఫ్ తో కలిపి ఒక మినపట్టు

ఉదయం 11:30 గంటలకు..

100 గ్రా.. సీజనల్ ఫ్రూట్స్

మధ్యాహ్నం 2 గంటలకు..

చపాతీ, పప్పు, పనీర్ సబ్జీ, సలాడ్, కప్పు పెరుగు

సాయంత్రం 5 గంటలకు..

రోస్టెడ్ మఖానా

రాత్రి 7:30 గంటలకు..

దాల్ కిచిడి, సలాడ్


మంగళవారం..

ఉదయం 10:00 గంటలకు

కొబ్బరి చట్నీ, సాంబార్ తో కలిపి రెండు ఇడ్లీలు

ఉదయం 11:30 గంటలకు..

చాయ్ పుడ్డింగ్, ఫ్రూట్స్

మధ్యాహ్నం 2 గంటలకు..

80 గ్రా.. పనీర్, వెజిటేబుల్ బిర్యానీ

సాయంత్రం 5 గంటలకు..

ఒక కప్పు మరమరాలతో చేసిన స్నాక్

రాత్రి 7:30 గంటలకు..

ఫ్రై చేసిన వెజిటేబుల్స్ తో చేసిన వంటకం


బుధవారం..

ఉదయం 10:00 గంటలకు

ఒక వెజిటేబుల్ పరాటా, కప్పు పెరుగు

ఉదయం 11:30 గంటలకు..

వంద గ్రాముల సీజనల్ ఫ్రూట్

మధ్యాహ్నం 2 గంటలకు..

ఒక చపాతీ, శనగలతో చేసిన కూర, సలాడ్, పెరుగు

సాయంత్రం 5 గంటలకు..

పది నానబెట్టిన బాదంపప్పులు

రాత్రి 7:30 గంటలకు..

పన్నీర్, వెజిటేబుల్స్ తో పాటు ఫ్రైడ్ రైస్


గురువారం..

ఉదయం 10:00 గంటలకు

గ్రీన్ చట్నతో ఒక శనగ పిండితోచేసిన అట్టు

ఉదయం 11:30 గంటలకు..

ఒక గ్లాసు ఏబీసీ జ్యూస్ (బీట్రూట్, క్యారెట్, ఆపిల్ తో చేసినది)

మధ్యాహ్నం 2 గంటలకు..

ఒక చపాతీ,కూరలు

సాయంత్రం 5 గంటలకు..

వేయించిన శనగలు

రాత్రి 7:30 గంటలకు..

100 గ్రా.. రైస్, 100 గ్రా.. రాజ్ మా, సలాడ్


శుక్రవారం..

ఉదయం 10:00 గంటలకు

రాత్రి నానబెట్టిన ఓట్స్ తో పాటు ఏవైనా ఫ్రూట్స్

ఉదయం 11:30 గంటలకు..

ఒక గ్లాసు వెజిటేబుల్ జ్యూస్

మధ్యాహ్నం 2 గంటలకు..

ఒక రోటీ, సోయా కర్రీ, సలాడ్, పెరుగు

సాయంత్రం 5 గంటలకు..

పీనట్ బటర్ తో 1 ఆపిల్

రాత్రి 7:30 గంటలకు..

కార్న్, పనీర్ రైస్, వెజిటేబుల్ సలాడ్


శనివారం..

ఉదయం 10:00 గంటలకు

ఓట్స్ తో చేసిన అట్టు, వెజిటేబుల్స్

ఉదయం 11:30 గంటలకు..

యోగర్ట్, స్ట్రాబెర్రీ

మధ్యాహ్నం 2 గంటలకు..

100 గ్రాముల రైస్, పప్పు, బెండకాయ, పెరుగు

సాయంత్రం 5 గంటలకు..

ఓట్ మీల్‌తో పాటు పది నానబెట్టిన బాదంపప్పులు

రాత్రి 7:30 గంటలకు..

100 గ్రా.. గోధుమలతో చేసే దలియా, వెజిటేబుల్స్


ఆదివారం..

ఉదయం 10:00 గంటలకు

పన్నీర్, వెజిటేబుల్స్ తో కలిపిన ఒక సాండ్విచ్

ఉదయం 11:30 గంటలకు..

100 గ్రా.. సీజనల్ ఫ్రూట్స్

మధ్యాహ్నం 2 గంటలకు..

ఒక రోటీ, పప్పు, పనీర్ కూర, సలాడ్, పెరుగు

సాయంత్రం 5 గంటలకు..

ఒక ప్రొటీన్ బార్

రాత్రి 7:30 గంటలకు..

సోయాబీన్ మష్రూమ్ కూర, ఒక రోటీ, సలాడ్

Updated Date - Nov 19 , 2024 | 07:20 PM