IPL 2024: కీలక 12 మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్‌కు దూరం.. ఈ లిస్ట్ చుశారా?
ABN , Publish Date - Mar 21 , 2024 | 03:11 PM
IPL 2024 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ 17వ సీజన్ రేపు (మార్చి 22న) చెపాక్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలతోపాటు పలు కారణాలతో దూరమయ్యారు. వారి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
IPL 2024 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ 17వ సీజన్ రేపు (మార్చి 22న) చెపాక్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మొదలు కానుంది. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాళ్లు గాయాలతోపాటు పలు కారణాలతో దూరమయ్యారు. అయితే ఎంత మంది దూరమయ్యారు. వారి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
1. మహ్మద్ షమీ: 2023 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన షమీ, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో చీలమండ గాయంతో ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. ఇటీవల షమీకి లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది.
2. మాథ్యూ వేడ్: ఈ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆడడు. అతను మార్చి 21 నుంచి 25 వరకు టాస్మానియా తరపున షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ రెండో మ్యాచ్ (మార్చి 27) నుంచి వచ్చే అవకాశం ఉంది.
3. మార్క్ వుడ్: T20 ప్రపంచ కప్, ఇంగ్లాండ్ దేశవాళీ సీజన్‌కు ముందు పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని IPL నుంచి వైదొలగాలని ECB వుడ్‌ని కోరింది. అతని స్థానంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు.
4. ప్రసిద్ధ్ కృష్ణ: ఫిబ్రవరిలో శస్త్రచికిత్స చేయించుకున్న భారత ఫాస్ట్ బౌలర్ వరుసగా రెండవ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా అతడు గాయపడ్డాడు.
5. జాసన్ రాయ్: ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వ్యక్తిగత కారణాల వల్ల IPL 2024 నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ టూ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టు తీసుకుంది.
6. గుస్ అట్కిన్సన్: ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను ఈ సంవత్సరం వేలంలో KKR కొనుగోలు చేసింది. అతను తన మొదటి ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. పనిభారం కారణంగా ECB అతనికి NOC ఇవ్వనందున అట్కిన్సన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది.
7. డెవాన్ కాన్వే: న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఇటీవల బొటనవేలు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో ఎనిమిది వారాల వరకు అతను ఆటకు దూరంగా ఉంటాడని ప్రకటించారు.
8. హ్యారీ బ్రూక్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ IPL 2024 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. భారత్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు చనిపోయిన క్రమంలో ఆటకు దూరమైనట్లు తెలుస్తోంది.
9. మార్క్ వుడ్: ECB వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా IPL 2024 నుంచి వైదొలిగాడు. షామర్ జోసెఫ్ LSGకి అతని స్థానంలో ఎంపికయ్యాడు.
10. రాబిన్ మింజ్: మిన్జ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతనికి IPL 2024కి అవకాశం లేకుండా పోయింది.
11. దిల్షన్ మధుశంక: గాయం కారణంగా మధుశంక తొలి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది
12. శ్రేయాస్ అయ్యర్: రంజీ ట్రోఫీ ఫైనల్ సమయంలో వెన్నునొప్పి సమస్యల కారణంగా IPL 2024లో అతని ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: కోచ్‌తో కలిసి ప్లేయర్ డ్యాన్స్.. వీడియో అదిరిపోయిందిగా..