Abhishek Sharma: రికార్డు సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. అతడు ఆడిన బ్యాట్ ఎవరిదంటే..!
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:40 PM
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దుమ్ము రేపిన యువ క్రికెటర్ అభిషేక్ శర్మ టీమిండియా తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనే మెరుపు సెంచరీ చేశాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దుమ్ము రేపిన యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) టీమిండియా తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనే మెరుపు సెంచరీ (Abhishek Sharma Century) చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) తన రెండో మ్యాచ్‌లో అద్భుత శతకంతో అదుర్స్ అనిపించుకున్నాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేసి తన తడాఖా చూపించాడు.
ఆరంభంలో పిచ్ పరిస్థితులను బట్టి నెమ్మదిగా ఆడిన అభిషేక్ పదో ఓవర్ తర్వాత గేర్ మార్చాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ దెబ్బతో మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన యువ భారత జట్టు రెండో మ్యాచ్‌లో జింబాబ్వేపై ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తన బ్యాట్ (Abhishek Sharma Bat) గురించి ఓ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టాడు. తన స్నేహితుడు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Subhman Gill) బ్యాట్‌తో ఆడినట్టు అభిషేక్ తెలిపాడు. తనకు గిల్‌తో ఉన్న అనుబంధం గురించి తెలిపాడు.
``అండర్-12 నుంచి గిల్, నేను కలిసి ఆడుతున్నాం. అప్పట్నుంచే మా మధ్య స్నేహం ఉంది. నేను భారత జట్టుకు ఎంపికైనపుడు గిల్ నుంచి నాకు మొదటి ఫోన్ వచ్చింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో గిల్ బ్యాట్‌తో ఆడడం నాకు ఎప్పట్నుంచో అలవాటు. ఐపీఎల్‌లో కూడా గిల్ బ్యాట్‌తో కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఈ మ్యాచ్‌లో కూడా గిల్ బ్యాట్‌తోనే ఆడాను. సెంచరీ చేశాను. గిల్‌కు, అతడి బ్యాట్‌కు ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన యువరాజ్ సింగ్‌కు, మా నాన్నకు ధన్యవాదాలు`` అంటూ అభిషేక్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!
పవర్‌లిఫ్టింగ్‌లో సుకన్యకు స్వర్ణం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..