Share News

Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:18 PM

విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టీ20 ప్రపంచకప్ గెలుచుకుని వచ్చిన రోహిత్ సేనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.

Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!
Team India

విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు (Team India) క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) గెలుచుకుని వచ్చిన రోహిత్ సేనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) భారీ నజరానా (Prize money) ప్రకటించింది. రూ.125 కోట్ల నజరానా అందించబోతున్నట్టు తెలిపింది. రోహిత్ సేన భారత్‌కు రాగానే ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రూ.125 కోట్ల ప్రైజ్‌మనీకి సంబంధించిన చెక్కును అందించారు. మరి, ఈ రూ. 125 కోట్లను ఆటగాళ్లు ఎలా పంచుకుంటారో తెలుసా?


ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది కలిపి మొత్తం 42 మంది టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా-వెస్టిండీస్ వెళ్లారు. వారందరూ కలిసి బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్లను పంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 ఆటగాళ్లు, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐదేసి కోట్లు అందుకోనున్నారు. అంటే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని వారు కూడా రూ.5 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే సహాయ సిబ్బంది జాబితాలో ఉండే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ తదిరులు ఒక్కొక్కరూ రూ.2.5 కోట్లు అందుకుంటారు.


సహాయక సిబ్బంది జాబితాలో ఉండే ఫిజియోథెరపిస్ట్‌లు, త్రోడౌన్ స్పెషలిస్టులు, మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు ఇస్తారు. అలాగే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన అజిత్ అగార్కర్‌తో పాటు సెలక్షన్ కమిషన్ సభ్యులు ఒక్కొక్కరికీ రూ. కోటి అందజేస్తారు. అలాగే రిజర్వ్ అటగాళ్లు అయిన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు కూడా రూ.కోటి చొప్పున ఇస్తారు.

ఇవి కూడా చదవండి..

అహో.. అభిషేక్‌


20ఏళ్ల తర్వాత..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 08 , 2024 | 12:18 PM