Share News

Gautam Gambhir: గంభీర్ విదేశీ కోచ్ కాదు.. రోహిత్, కోహ్లీ కోసం అలా చేయడం తప్పు: ఆశీష్ నెహ్రా!

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:47 PM

సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కోసం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ పెద్ద అవకాశాన్ని జార విడిచాడని, ఇది సరైన విధానం కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఆశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం రోహిత్, కోహ్లీలను జట్టులోకి తీసుకోవడం పెద్ద తప్పిదమని నెహ్రా పేర్కొన్నాడు.

Gautam Gambhir: గంభీర్ విదేశీ కోచ్ కాదు.. రోహిత్, కోహ్లీ కోసం అలా చేయడం తప్పు: ఆశీష్ నెహ్రా!
Gautam Gambhir with Virat Kohli

సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కోసం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఓ పెద్ద అవకాశాన్ని జార విడిచాడని, ఇది సరైన విధానం కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఆశీష్ నెహ్రా (Ashish Nehra) అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం రోహిత్, కోహ్లీలను జట్టులోకి తీసుకోవడం పెద్ద తప్పిదమని, గంభీర్ బలవంతం మీదనే వారు టీమ్‌లోకి వచ్చారని నెహ్రా పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడాడు.


``టీమిండియా మరో రెండు, మూడు నెలల వరకు మరో సిరీస్ ఆడకపోవచ్చు. ఈ సిరీస్‌కు కూడా కోహ్లీ, రోహిత్‌ను పక్కన పెట్టాల్సింది. గంభీర్ కొత్త కోచ్ కావచ్చు. సీనియర్ ఆటగాళ్లతో కొంత సమయం గడిపితే మంచిదని అనుకోవచ్చు. కానీ, గంభీరేం విదేశీ కోచ్ కాదు. వాళ్లిద్దరితో గతంలోనే గంభీర్‌‌కు పరిచయం ఉంది. వారి కోసం గంభీర్ మంచి అవకాశం వదులుకున్నాడు. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. కొత్త ఆటగాళ్లను ప్రయత్నిస్తే బాగుండేది`` అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.


టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతారు. తాజాగా జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో మొదటిది టై అవగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: మా బ్యాటింగ్‌పై చర్చ జరగాల్సిందే.. మ్యాచ్ ఓటమిపై రోహిత్ వ్యాఖ్యలు!


Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌


సెమీస్‌లో రోహిదాస్‌ ఆడేనా?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 05 , 2024 | 07:47 PM