French Open: పాపం పీవీ సింధు.. సెమీస్‌కు లక్ష్య సేన్, సాత్విక్-చిరాగ్
ABN , Publish Date - Mar 09 , 2024 | 10:28 AM
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్(French Open Super 750 tournament)లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధు(PV Sindhu)కి మళ్లీ పరాభవం ఎదురైంది. చైనాకు చెందిన టోక్యో ఒలింపిక్ విజేత చెన్ యు ఫీ చేతిలో ఓడిపోయింది. సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ 24-22, 17-21, 18-21 తేడాతో రెండో సీడ్ చెన్ యు ఫీ చేతిలో ఓడింది.
మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్(Lakshya Sen) పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించి అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో లోహ్ కీన్ యును ఓడించి సెమీస్‌లోకి(semi final) దూసుకెళ్లాడు. ప్యారిస్‌లో 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత షట్లర్ 19-21, 21-15, 21-13 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్‌ను ఓడించాడు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయుడిగా లక్ష్యసేన్ రికార్డు సృష్టించాడు. సెమీ ఫైనల్ రౌండ్లో డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్, ఎనిమిదో సీడ్ కున్లావుట్ విటిడ్సర్న్తో తలపడనున్నాడు.
మరోవైపు టాప్ సీడ్ భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి(satwiksairaj rankireddy), చిరాగ్ శెట్టి(chirag shetty) కూడా సెమీ ఫైనల్లోకి(semi finals) ప్రవేశించారు. సాత్విక్-చిరాగ్ 21-19, 21-13తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్ జోమ్కో, కిట్టానుపాంగ్ కేడ్రెన్పై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సెమీఫైనల్లో మూడో సీడ్ కొరియా జోడీ కాంగ్ మిన్ హ్యూక్ సియో సీయుంగ్ జేతో తలపడనున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IND vs ENG: టీమిండియా ఆలౌట్.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ ఎన్ని రన్స్ చేయాలంటే..